logo

Rajoli: ఆలయానికి కలశం వితరణ

మండలకేంద్రమైన రాజోలి గ్రామంలోని అడివేశ్వర స్వామి ఆలయానికి హైదరబాద్‌కు చెందిన భక్తురాలు ఈరమ్మ కలశం వితరణ చేశారు.

Published : 25 May 2024 18:48 IST

రాజోలి: మండలకేంద్రమైన రాజోలి గ్రామంలోని అడివేశ్వర స్వామి ఆలయానికి హైదరబాద్‌కు చెందిన భక్తురాలు ఈరమ్మ కలశం వితరణ చేశారు. రూ.20 వేల విలువైన ఈ కలశాన్ని శనివారం ఆమె సంబంధీకులు ఆలయ కమిటీ సభ్యులకు అందించారు. ప్రస్తుతం ఆలయంలో దాతల సహకారంతో మండప నిర్మాణం చేపడుతున్నామని, రానున్న రోజుల్లో ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లుగా ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ నాగేశ్వర్‌రావ్, జయరెడ్డి, గోపాల్‌రెడ్డి, అడవిస్వామి తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని