logo

Rajoli: నకిలీ విత్తనాలు కొని నష్టపోవద్దు

నకిలీ విత్తనాలు కొని రైతులు నష్టపోవద్దని ఐజ మండల వ్యవసాయ అధికారి శంకర్ లాల్ సూచించారు.

Updated : 25 May 2024 17:00 IST

రాజోలి: నకిలీ విత్తనాలు కొని రైతులు నష్టపోవద్దని ఐజ మండల వ్యవసాయ అధికారి శంకర్ లాల్ సూచించారు. మండల పరిధిలోని యాపదిన్నె గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏఈఓ అరవింద్ ఆధ్వర్యంలో శనివారం విత్తనాల కొనుగోలు పై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ.. ప్రభుత్వ అనుమతులు ఉండి, గుర్తింపు ఉన్న నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయాలన్నారు. విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో ఒరిజినల్ బిల్లు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని