logo

Suspicious Death: వనపర్తి మండలంలో వ్యక్తి అనుమానాస్పద మృతి

వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండల కేంద్రంలోని రంగసముద్రం దిలాశం సమీపంలో వ్యక్తి మృతదేహం కలకలం రేపింది.

Updated : 10 Oct 2023 10:03 IST

శ్రీరంగాపురం: వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండల కేంద్రంలోని రంగసముద్రం దిలాశం సమీపంలో వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, మృతదేహాన్ని పరిశీలించి.. ఘటనపై కేసు నమోదు చేశారు. మృతుడు వనపర్తి మండలం దవాచిపల్లి గ్రామానికి చెందిన దాసుగా గుర్తించారు. అతడిని ఎవరైనా హత్య చేశారా? లేక ఆత్మహత్య చేసుకున్నాడా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతున్నట్లు విచారణలో వెల్లడైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని