logo

రెండో రోజు ఆరు నామినేషన్లు

పాలమూరులోని మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో రెండో రోజు  ఆరుగురు ఏడు సెట్ల నామపత్రాలు దాఖలు చేశారు.

Published : 20 Apr 2024 04:09 IST

ఈనాడు, మహబూబ్‌నగర్‌: పాలమూరులోని మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో రెండో రోజు  ఆరుగురు ఏడు సెట్ల నామపత్రాలు దాఖలు చేశారు. మొదటి, రెండు రోజులు కలుపుకొని మొత్తం 10 మంది అభ్యర్థులు 12 సెట్ల నామపత్రాలు సమర్పించారు. ఈ రెండు రోజుల్లో భాజపాకు చెందిన డీకే అరుణ, భరత్‌ ప్రసాద్‌, కాంగ్రెస్‌ అభ్యర్థులైన వంశీచంద్‌రెడ్డి, మల్లు రవి, భారాస అభ్యర్థులైన మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ తమ నామపత్రాలను సమర్పించారు. వీరితో పాటు మరో నలుగురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు చేశారు.

వంశీచంద్‌రెడ్డి మినహా..: మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి మినహా మిగతా అభ్యర్థులంతా శుక్రవారం సాదాసీదాగానే నామపత్రాలు దాఖలు చేశారు. భారాస అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి తరపున శ్రీధర్‌రెడ్డి, అనచరులు రవీందర్‌రెడ్డి రిటర్నింగ్‌ అధికారికి నామపత్రాలు అందించారు. స్వతంత్ర అభ్యర్థులుగా ఉమాశంకర్‌, సరోజనమ్మ, హరిందర్‌రెడ్డి నామపత్రాలు సమర్పించారు. నాగర్‌కర్నూల్‌లో శుక్రవారం భారాస అభ్యర్థి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ నామినేషన్‌ వేశారు. ఆయన వెంట మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్‌, మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాలరాజు ఉన్నారు.

 

మహబూబ్‌నగర్‌లో స్వతంత్ర అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేస్తున్న హరిందర్‌రెడ్డి.. సరోజనమ్మ... ఉమాశంకర్‌.. భారాస అభ్యర్థి
మన్నె శ్రీనివాస్‌రెడ్డి తరపున నామపత్రాలు దాఖలు చేస్తున్న శ్రీధర్‌రెడ్డి, రవీందర్‌ రెడ్డి తదితరులు..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని