logo

ఇంటర్ ఫలితాల్లో 62.82 శాతం ఉత్తీర్ణత

ఇంటర్మీడియట్ జనరల్ విభాగం  ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జోగులాంబ గద్వాల జిల్లా 62.82 శాతంతో 23వ స్థానంలో నిలిచింది.

Updated : 24 Apr 2024 16:44 IST

రాజోలి: ఇంటర్మీడియట్ జనరల్ విభాగం  ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జోగులాంబ గద్వాల జిల్లా 62.82 శాతంతో 23వ స్థానంలో నిలిచింది. మొత్తం 2,948 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 1,852 మంది విద్యార్థులు ఉతీర్ణత సాధించారు. జనరల్ మొదటి సంవత్సరం ఫలితాల్లో 53.48 శాతంతో 21వ స్థానంలో నిలిచింది.  3,257 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 1,742 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వొకేషనల్ ద్వితీయ సంవత్సరంలో 72.4 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.  634 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 459 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని జిల్లా ఇంటర్ నోడల్ అధికారి హృదయ రాజు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని