logo

40 ఎకరాలకు పాకిన మంటలు

యాసంగిలో వరి పంటను యంత్రాలతో కోయించిన కొందరు రైతులు కొయ్యలకు నిప్పంటించడం వల్ల మంటలు గాలివాటానికి సమీప పొలాలకు వ్యాపించి నష్టాన్ని కలిగిస్తున్నాయి.

Published : 19 May 2024 06:01 IST

గోపాల్‌పేటలో మండుతున్న వరికొయ్యలు 

గోపాల్‌పేట, న్యూస్‌టుడే : యాసంగిలో వరి పంటను యంత్రాలతో కోయించిన కొందరు రైతులు కొయ్యలకు నిప్పంటించడం వల్ల మంటలు గాలివాటానికి సమీప పొలాలకు వ్యాపించి నష్టాన్ని కలిగిస్తున్నాయి. వరి కొయ్యలకు నిప్పంటించొద్దని వ్యవసాయాధికారుల సూచనలను కొందరు పెడచెవిన పెడుతున్నారు. వీరి చర్యలతో పశువుల పాకలు, మామిడితోటలు కాలిపోయిన సంఘటనలు ఉన్నాయి. శనివారం గోపాల్‌పేటలో వరి కొయ్యలకు ఎవరైనా కావాలని నిప్పంటించారా? లేక ప్రమాదవశాత్తు మంటలంటుకున్నాయో తెలియదు కానీ సుమారు 40 ఎకరాలకు మంటలు వ్యాపించాయి. గ్యాస్‌ గోదాం, పెట్రోలుపంపు సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు వరి కొయ్యలకు నిప్పు పెట్టారు. మంటలు 40 ఎకరాల వరకు వ్యాపించాయి. వనపర్తి నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చి వాటిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. పొలంగట్లను దాటి వాహనం వెళ్లలేక పోవడంతో వాహన సిబ్బంది అందివచ్చిన వరకు మంటలను ఆర్పారు. రైతులు బోర్లనీటిని పైపుల ద్వారా తీసుకెళ్లి అదుపులోకి తీసుకొచ్చారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని