logo

తెగ తాగారు

వేసవితాపం నుంచి ఉపశమనం పొందేందుకు జిల్లాలో మందుబాబులు తెగ తాగేశారు. వేసవితో పాటు ఎన్నికల సందర్భంగా మార్చి, ఏప్రిల్, మే నెలలో మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి.

Updated : 19 May 2024 06:24 IST

గోదాం నుంచి దుకాణాలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న మద్యం సీసాల కాటన్లు

వనపర్తి న్యూటౌన్, న్యూస్‌టుడే: వేసవితాపం నుంచి ఉపశమనం పొందేందుకు జిల్లాలో మందుబాబులు తెగ తాగేశారు. వేసవితో పాటు ఎన్నికల సందర్భంగా మార్చి, ఏప్రిల్, మే నెలలో మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. గతేడాది మే నెలలో రూ.1.94 కోట్లు మద్యం విక్రయాలు జరగగా.. ఈ ఏడాది మే 18వ తేదీ నాటికి రూ.1.45 కోట్లు విలువ గల మద్యం అమ్మకాలు జరిగాయి. కడుకుంట్ల లిక్కర్‌ గోదాం పరిధిలో 111 మద్యం దుకాణాలు, 20 బార్లు ఉన్నాయి. గతేడాది ఏప్రిల్‌లో రూ.1.75 కోట్లు వ్యాపారం జరగగా ఈ ఏడాది అదే నెలలో రూ.2.02 కోట్లు అమ్మకాలు జరిగాయి.

  • 2023 మార్చి, ఏప్రిల్, మే నెల వరకు 3,38,850 కేసుల మద్యం, 5,46,368 బీర్ల కేసులు అమ్ముడుబోగా రూ.5.37కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఈ ఏడాది మార్చి నుంచి మే 16వ తేదీ వరకు 3,03,009 కేసుల మద్యం, 4,45,879 బీర్ల కేసులు అమ్ముడుబోయాయి. 
  • గతేడాది ఏప్రిల్‌లో రూ.1.35 కోట్ల విలువగల 91,250 కేసుల మద్యం, 1,47,600 కేసుల బీర్లు అమ్మారు. ఈ ఏడాది ఇదే నెలలో రూ.2.02 కోట్ల విలువ గల మద్యం 1,17,284 కేసులు, 1,99,800 కేసుల బీర్లు అమ్ముడుబోయాయి. ఎన్నికల పుణ్యమా అని 26,034 కేసుల మద్యం, 52,200 కేసుల బీర్లు ఎక్కువగా అమ్ముడుబోయాయి.
  • ఎన్నికల సందర్భంగా పోలీసులు గొలుసు దుకాణాలపై దాడులు చేసిన కేసులు నమోదు చేసినా గుట్టుచప్పుడు కాకుండా అమ్మకాలు కొనసాగాయి. దీంతో గతేడాదితో పోలిస్తే ఈ  ఏడాది మద్యం విక్రయాలు ఎక్కువగా జరిగాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని