రూ.కోట్లు ఖర్చు.. వైద్యం దైవాధీనం
సామాజిక ఆరోగ్య కేంద్రాలలో సరిపడా సిబ్బంది లేక రోగులకు వైద్యం అందటం లేదు. కోట్లాది రూపాయల వ్యయంతో అసుపత్రి భవనాలను నిర్మించినా ఉపయోగం లేకుండా పోతోంది. అత్యవసర పరిస్థితుల్లో రోగులను జిల్లా కేంద్రాలకు తరలిస్తున్నారు.
మద్దూరులోని సామాజిక ఆరోగ్య కేంద్రం
న్యూస్‌టుడే, మద్దూరు: సామాజిక ఆరోగ్య కేంద్రాలలో సరిపడా సిబ్బంది లేక రోగులకు వైద్యం అందటం లేదు. కోట్లాది రూపాయల వ్యయంతో అసుపత్రి భవనాలను నిర్మించినా ఉపయోగం లేకుండా పోతోంది. అత్యవసర పరిస్థితుల్లో రోగులను జిల్లా కేంద్రాలకు తరలిస్తున్నారు.
మద్దూరులో ఒకప్పుడు చిన్న భవనంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నామమాత్రపు సిబ్బందితో ఉండేది. దీన్ని వైద్య విధాన పరిషత్తులోకి మారుస్తూ రూ.3.5 కోట్ల వ్యయంతో సౌకర్యాలతో కొత్త భవనం నిర్మించారు. 30 పడకల అసుపత్రిగా మార్చారు. 2022 జూన్16న అప్పటి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. రెండేళ్లు గడుస్తున్నా సిబ్బందిని నియమించలేదు. మద్దూరు, కొత్తపల్లి మండలాల పరిధిలో 50కి పైగా గ్రామల ప్రజలు వైద్యానికి మద్దూరుకు వస్తుంటారు. గతంలో 100 లోపు రోగులు వచ్చే ఈ అసుపత్రికి ప్రస్తుతం ప్రతి రోజూ 300 వరకు రోగులు వస్తున్నారు. కొత్త భవనం, అధునాతన సౌకర్యాలు అందుబాటులో ఉన్నా సరిపడా వైద్యులు, సిబ్బంది లేక రోగులకు అవస్థలు తప్పటం లేదు. ప్రధానంగా మహిళలకు వైద్య సేవలు అందించే నిపుణులు(గైౖనకాలజిస్ట్) లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో జిల్లా కేంద్రాలకు తరలిస్తున్నారు.గర్భిణులకు వైద్యం, సూచనలు అందటం లేదు. పురిటి నొప్పుల సమయంతో మహిళలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆరుగురు డాక్టర్లు ఉండాలి. కానీ ఓ వైద్యురాలు మాత్రమే ఉన్నారు. రాత్రి వేళల్లో వచ్చే రోగులకు వైద్యం అందించే వారు లేక నర్సలు వైద్యం చేస్తున్నారు. పరిస్థితి చేయి దాటిపోతే నారాయణపేట, మహబూబ్‌నగర్‌కు తరలిస్తున్నారు.
కోస్గిలో రూ.5.5 కోట్ల వ్యయంతో నిర్మించిన 50 పడకల సామాజిక అసుపత్రిలో సిబ్బంది లేక రోగులకు సరైన వైద్యం అందటం లేదు. రెండేళ్ల కిందట నిర్మించిన ఈ అసుపత్రిలో అరకొర సేవలే అందుతున్నాయి.
మక్తల్‌లో 150 పడకల కొత్త ఆసుపత్రి భవన నిర్మాణానికి 2023 నవంబరులో శంకుస్థాపన చేశారు. నేటికీ నిర్మాణం పనులు ప్రారంభం కాలేదు. 80 ఏళ్ల కిందట నిర్మించిన భవనంలో సరైన వసతులు లేక రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన
[ 27-07-2024]
బహిరంగ సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పరిశీలించారు. -
పాన్‌గల్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
[ 27-07-2024]
పాన్‌గల్ : పాన్‌గల్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రరాన్ని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని పలు దస్త్రా లను పరిశీలించారు. గర్భిణులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. -
ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
[ 27-07-2024]
రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాధికారి ఇందిరా ఒక ప్రకటనలో తెలిపారు. -
దిగువకు సుంకేసుల జలాశయం నీటి విడుదల
[ 27-07-2024]
రాజోలి శివారులోని సుంకేసుల జలాశయానికి ఎగువన ఉన్న తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. -
ఆదాయం పెరిగినా వెనకంజే!
[ 27-07-2024]
తలసరి ఆదాయంలో మహబూబ్‌నగర్ జిల్లా గతేడాది రాష్ట్రంలో 7వ స్థానంలో ఉండగా ఈ సారి 9వ స్థానానికి పరిమితమైంది. -
తగ్గుతున్న విద్యుదుత్పత్తి
[ 27-07-2024]
కృష్ణానదిలో వరద ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతోంది. ప్రవాహం పెరగడం జూరాల ఎగువ, దిగువ కేంద్రాల్లో విద్యుదుత్పత్తికి ప్రతిబంధకంగా మారుతోంది. -
పరారీలో కీలక నిందితుడు
[ 27-07-2024]
నడిగడ్డ ప్రాంతంలో నిషేధిత మత్తు పదార్థాలతో కృత్రిమంగా కల్లు తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో మొదటిసారి నార్కోటిక్స్ దాడులు నిర్వహించడం కలకలం సృష్టిస్తోంది. -
కృష్ణాలో పెరుగుతున్న నీటిమట్టం
[ 27-07-2024]
కృష్ణానదిలో రోజురోజుకు నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం నాటికి 862 అడుగుల మేర నీళ్ల నిల్వ ఉంది. -
అడవి జంతువు మాంసాన్ని విక్రయించే యత్నం
[ 27-07-2024]
అడవి జంతువును హతమార్చి మాంసాన్ని విక్రయించేందుకు ప్రయత్నించిన ఘటనలో ఒకరిని అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు శిక్షణ రేంజ్ అధికారి (ఐఎఫ్ఎస్) సుశాంత్ బోబ్డె తెలిపారు. -
అతివలకు బీమా..అవగాహనతోనే ధీమా
[ 27-07-2024]
‘మహిళా శక్తి’ పేరుతో ప్రత్యేక రుణాలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం, అతివల కోసం బీమా పథకాలను సైతం అమల్లోకి తెచ్చింది. -
కృష్ణా నదిలో గుర్రంగడ్డ
[ 27-07-2024]
రెండు వేల ఎకరాలకుపైగా విస్తీర్ణం.. వెయ్యికిపైగా ఎకరాల్లో పంటల సాగు.. వెయ్యి మంది జనాభా.. 60 మంది విద్యార్థులు.. నలు వైపులా కృష్ణా నది.. ఇదీ గుర్రంగడ్డ ప్రత్యేకత. -
నగల దుకాణంలో చోరీ
[ 27-07-2024]
షట్టర్లను ధ్వంసం చేసి నగల దుకాణంలో చోరీ చేసిన ఘటన బాలానగర్ మండల కేంద్రంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. -
రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్‌లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్‌బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్‌పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి