logo

లోక్‌ అదాలత్‌ సద్వినియోగం చేసుకోండి

వచ్చే నెల 8వ తేదీన నిర్వహించే జాతీయ లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి తెలిపారు. శనివారం మహబూబ్‌నగర్‌లోని కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్‌ అదాలత్‌ను పురస్కరించుకొని కలెక్టర్‌ రవినాయక్,

Published : 19 May 2024 06:19 IST

జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. పాపిరెడ్డి

జైలులో కూరలు పరిశీలిస్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి, చిత్రంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఇందిర, జైలు పర్యవేక్షకుడు వెంకటేశం 

మహబూబ్‌నగర్‌ నేరవిభాగం, న్యూస్‌టుడే : వచ్చే నెల 8వ తేదీన నిర్వహించే జాతీయ లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి తెలిపారు. శనివారం మహబూబ్‌నగర్‌లోని కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్‌ అదాలత్‌ను పురస్కరించుకొని కలెక్టర్‌ రవినాయక్, ఎస్పీ హర్షవర్ధన్‌తో కలిసి సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ లోక్‌ అదాలత్‌లో క్రిమినల్, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్, ఈ-పిట్టి, ట్రాఫిక్‌ చలాన్లు, భూతగదా, సివిల్‌ కేసులు ఎక్కువ మొత్తంలో పరిష్కరించేలా కృషి చేయాలని కోరారు. అనంతరం జిల్లా కోర్టులో బీమా కంపెనీ స్టాండింగ్‌ కౌన్సిల్‌తో సమావేశం ఏర్పాటు చేశారు. మోటారు వాహనాల ప్రమాదాల కేసులను అధిక మొత్తంలో పరిష్కరించేలా చూడాలని, కక్షిదారులు వచ్చే నెలలో నిర్వహించే జాతీయ లోక్‌ అదాలత్‌కు వచ్చేలా చూడాలని వారికి సూచించారు. 

జైలులో తనిఖీలు : మహబూబ్‌నగర్‌లోని కారాగారాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఇందిరతో కలిసి జైలులో ఖైదీలకు అందుతున్న వసతులపై ఆరాతీశారు. ఖైదీలకు అందిస్తున్న ఆహార పదార్థాలు, తాగునీరు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, నివాస వసతి బ్యారక్, ఇతర అంశాలపై జైలు అధికారులను ఆరాతీశారు. జైలులో ఉన్న ఖైదీలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో జైలు పర్యవేక్షకులు వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని