logo

గ్రూప్‌-1 ప్రిలిమినరీకి పకడ్బందీ ఏర్పాట్లు

జూన్‌ 9న నిర్వహించే గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షకు జిల్లాల్లో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్‌ మహేందర్‌ రెడ్డి ఆదేశించారు. శనివారం హైదరాబాద్‌ నుంచి వీసీలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షించారు.

Published : 19 May 2024 06:20 IST

వీసీలో కలెక్టర్‌ జి.రవి నాయక్, అదనపు కలెక్టర్‌ శివేంద్రప్రతాప్, అదనపు ఎస్పీ రాములు తదితరులు

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్, న్యూస్‌టుడే : జూన్‌ 9న నిర్వహించే గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షకు జిల్లాల్లో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్‌ మహేందర్‌ రెడ్డి ఆదేశించారు. శనివారం హైదరాబాద్‌ నుంచి వీసీలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షించారు. పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు కల్పించాలన్నారు. తగిన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని, సీసీ కెమెరాలను అమర్చాలని సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. చరవాణులు, ఎలక్ట్రానిక్‌ వస్తువులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించవద్దన్నారు. ఓఎంఆర్‌ పత్రాలు, ప్రశ్నపత్రాలు ఎస్పీ కార్యాలయాల్లో బందోబస్తు మధ్య ఉంచి, పరీక్ష కేంద్రాలకు జాగ్రత్తగా తరలించాలన్నారు. జూన్‌ 9న 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష కొనసాగుతుందని, ఉదయం 9 గంటల నుంచి అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతించాలన్నారు. అనంతరం కలెక్టర్‌ జి.రవి నాయక్‌ జిల్లా అధికారులతో సమీక్షిస్తూ గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షకు జిల్లాలో 36 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, 15,199 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తారని తెలిపారు. పోలీసు సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేశాకే పరీక్ష కేంద్రాల్లోకి అభ్యర్థులను అనుమతించాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యుత్తు సౌకర్యం, లైట్లు, ఫ్యాన్లు, తాగునీరు, వైద్య సిబ్బంది ఉండేలా చూడాలన్నారు. పరీక్ష నిర్వహణపై ఈనెల 22న హైదరాబాద్‌లో బయోమెట్రిక్‌ పోలీసు అధికారులు, పోలీసు నోడల్‌ అధికారులకు శిక్షణ ఉంటుందన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్, అదనపు ఎస్పీ రాములు, డీఆర్వో కేవీవీ రవికుమార్‌ తదితరులు హాజరయ్యారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని