logo

రూ.8.40 కోట్ల నగదు.. 33వేల లీటర్ల మద్యం

లోక్‌సభ ఎన్నికల వేళ పోలీసుల తనిఖీల్లో భారీగా నగదు, మద్యం పట్టుబడ్డాయి. మార్చి 13న కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల ప్రకటన విడుదల చేసింది. వెంటనే మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో 34 సరిహద్దు తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

Published : 19 May 2024 06:33 IST

పోలీసుల తనిఖీల్లో ఉమ్మడి జిల్లాలో పట్టుకున్నవి ఇవే 
న్యూస్‌టుడే, మహబూబ్‌నగర్‌ నేరవిభాగం, కందనూలు 

మహబూబ్‌నగర్‌ : న్యూటౌన్‌ కూడలి వద్ద వాహనాన్ని తనిఖీ చేస్తున్న పోలీసులు

లోక్‌సభ ఎన్నికల వేళ పోలీసుల తనిఖీల్లో భారీగా నగదు, మద్యం పట్టుబడ్డాయి. మార్చి 13న కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల ప్రకటన విడుదల చేసింది. వెంటనే మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో 34 సరిహద్దు తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మార్చి 13 నుంచి రాత్రింబవళ్లు రాష్ట్ర పోలీసు బలగాలతో పాటు కేంద్ర సాయుధ దళాలు గస్తీ నిర్వహించాయి. ఈ నెల 14వ తేదీ ఉదయం వరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చేసిన తనిఖీల్లో రూ.8.40 కోట్ల నగదు, 33,831.93 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. మద్యం విలువ రూ.2.98 కోట్లు ఉంటుందని అంచనా. 

  • మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గంలోని 14 చోట్ల తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రధానంగా కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దుగా ఉన్న నారాయణపేట జిల్లాలోని కృష్ణా, ధన్వాడ, నారాయణపేట, కొడంగల్, దామరగిద్ద, మద్దూరు మండలాల్లో 9 చోట్ల, మహబూబ్‌నగర్‌ జిల్లాలో బాలానగర్, నంచర్ల, అడ్డాకుల, లాల్‌కోట, కొల్లూరు ప్రాంతాల్లో ఐదు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. ఈ నెల 10న రాత్రి గోవా నుంచి భారీ మద్యం లోడ్‌తో వస్తున్న లారీని బాలానగర్‌ తనిఖీ కేంద్రం వద్ద పోలీసులు పట్టుకున్నారు. అనుమతి, ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.2.38 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 165 కేసులు నమోదు చేశారు. రూ.2,18,85,967 విలువైన 20,149.37 లీటర్ల మద్యాన్ని పట్టుకున్నారు. షాద్‌నగర్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌లో రాయికల్‌ టోల్‌ప్లాజా వద్ద చెక్‌పోస్ట్‌ ఏర్పాటు చేశారు. 
  • నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గం పరిధిలోని మద్యం, డబ్బుల ప్రభావాన్ని అరికట్టడానికి మూడు జిల్లాల పరిధిలో 19 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలో నందిన్నె, కేటీదొడ్డి, బల్గెర, రాజోలి, ర్యాలంపాడు, పుల్లూరు వద్ద, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో బిజినేపల్లి మండలం మంగనూర్, ఊర్కొండ, మన్ననూర్, పెంట్లవెల్లి, అచ్చంపేట, వెల్దండ, వనపర్తి జిల్లాలో ఖిల్లాగణపురం, కొత్తకోట, పెబ్బేరు వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఈ నియోజకవర్గంలో 383 నగదు పట్టివేత కేసులు నమోదు కాగా రూ.4.33 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. రూ.62.28 లక్షల విలువ చేసే 10,285 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని