నేర్పిస్తూ.. సత్తా చాటుతూ!
వారంతా సీనియర్ ఫుట్‌బాల్ క్రీడాకారులు. ప్రస్తుతం వివిధ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారు. ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ హాయిగా ఉండొచ్చు. కానీ ఇప్పటికీ క్రీడా స్ఫూర్తిని చాటుతున్నారు.
అఖిల భారత సివిల్ సర్వీసెస్ పోటీల్లో పాలమూరు యువకులు
న్యూస్‌టుడే, మహబూబ్‌నగర్ క్రీడలు
తెలంగాణ సివిల్ సర్వీసెస్ ఫుట్‌బాల్ జట్టులో జిల్లావాసులు
వారంతా సీనియర్ ఫుట్‌బాల్ క్రీడాకారులు. ప్రస్తుతం వివిధ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారు. ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ హాయిగా ఉండొచ్చు. కానీ ఇప్పటికీ క్రీడా స్ఫూర్తిని చాటుతున్నారు. ఔత్సాహిక క్రీడాకారులకు శిక్షణ ఇస్తూ.. మరోపక్క మైదానంలో సాధన చేస్తూ తమ ఫిట్‌నెస్ కాపాడుకుంటున్నారు. ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లో జరుగుతున్న అఖిల భారత సివిల్ సర్వీసెస్ ఫుట్‌బాల్ టోర్నీలో పాల్గొన్న రాష్ట్ర జట్టులో ఉమ్మడి జిల్లా నుంచి ఐదుగురు చోటు సంపాదించారు. ఇప్పటికే గుజరాత్, తమిళనాడు జట్లపై విజయం సాధించి హుషారుగా ఉన్నారు. స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న క్రీడాకారులపై ‘న్యూస్‌టుడే’ కథనం.
తెలంగాణ జట్టుకు సారథిగా..
మహబూబ్‌నగర్‌కు చెందిన ఇమ్మాన్యుయేల్ జేమ్స్ వైద్యారోగ్య శాఖలో సీనియర్ సహాయకుడిగా పనిచేస్తున్నారు. విద్యార్థి దశలో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో సాధన చేసి జాతీయ స్థాయి రూరల్ టోర్నీ, అండర్-17 ఎస్‌జీఎఫ్, అండర్-19 జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. 2001 నుంచి 2004 వరకు హైదరాబాద్‌లోని సాయ్‌లో శిక్షణ పొందారు. గతంలో గోవా, చెన్నై, త్రివేంద్రం, భూపాల్, దిల్లీలో నిర్వహించిన జాతీయ స్థాయి సివిల్ సర్వీసెస్ పోటీల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం భువనేశ్వర్‌లో నిర్వహిస్తున్న పోటీల్లో రాష్ట్ర జట్టులో గోల్‌కీపర్‌గా సత్తా చాటుతున్నారు. ఫుట్‌బాల్ క్రీడకు ప్రోత్సాహం అవసరమని ఇమ్మాన్యుయేల్ జేమ్స్ అన్నారు.
ఫార్వర్డ్ క్రీడాకారుడిగా ప్రతిభ..
ఏనుగొండకు చెందిన రామకృష్ణ నస్రుల్లాబాద్ జడ్పీ ఉన్నత పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్నారు. విద్యార్థి దశలో అండర్-14 ఎస్‌జీఎఫ్, రెండు రాష్ట్రస్థాయి పోటీలు, డిగ్రీ చదివే రోజుల్లో తిరుపతి వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తరఫున జాతీయ స్థాయిలో ఆడారు. 2015లో త్రివేంద్రం, 2019లో భోపాల్, 2023లో భువనేశ్వర్‌లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. జాతీయ స్థాయి, సంతోష్ ట్రోఫీ పోటీలకు క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని రామకృష్ణ వివరించారు.
క్రీడాకారులకు సానబెడుతూ..
పాలమూరుకు చెందిన భానుకిరణ్ మునిమోక్షం జడ్పీ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. విద్యార్థి దశలో అండర్-21 జాతీయ స్థాయి, సబ్ జూనియర్స్, అంతర్ విశ్వవిద్యాలయాల జాతీయ స్థాయి టోర్నీల్లో ఓయూ ఫుట్‌బాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. జట్టులో మిడ్ ఫీల్డర్‌గా రాణిస్తున్న ఆయన నాలుగు జాతీయ స్థాయి సివిల్ సర్వీసెస్ ఫుట్‌బాల్ టోర్నీల్లో పాల్గొన్నారు. పదుల సంఖ్యలో విద్యార్థులను జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దారు. వేపూర్‌కు చెందిన విద్యార్థి దినేశ్ ప్రతిష్ఠాత్మక సంతోష్ ట్రోఫీ టోర్నీకి ఎంపికయ్యాడు. ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ క్రీడాకారులను తయారు చేయడమే తన లక్ష్యమని చెబుతున్నారు భానుకిరణ్.
మూడో జాతీయ స్థాయి టోర్నీ..
జడ్చర్లకు చెందిన సయ్యద్ మొయినుద్దీన్ బాదేపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్నారు. విద్యార్థి దశలో ఫుట్‌బాల్, ఖోఖో, క్రికెట్, అథ్లెటిక్స్ క్రీడాకారుడిగా రాష్ట్రస్థాయి అండర్-16, అండర్-19, సబ్ జూనియర్స్ టోర్నీల్లో పాల్గొన్నారు. మూడు సివిల్ సర్వీసెస్ అఖిల భారత పోటీల్లో ఆడారు. 2008 నుంచి పీఈటీగా తన విద్యార్థులను జాతీయ స్థాయి క్రీడాకారులుగా తయారు చేశారు. వారంతా యూజీడీ కోర్సు చదువుతున్నారని, పీఈటీలుగా స్థిరపడేందుకు అవకాశం ఉందని చెప్పారు మొయిన్.
చిన్నారులను ప్రోత్సహించాలి
మహబూబ్‌నగర్‌కు చెందిన శశిధర్‌రెడ్డి వ్యవసాయ శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. జట్టులో ఫార్వర్డ్ స్థానంలో రాణిస్తున్న ఆయన ఇప్పటివరకు భోపాల్, దిల్లీలో జరిగిన సివిల్ సర్వీసెస్ జాతీయ స్థాయి టోర్నీలు ఆడారు. మూడో టోర్నీలో భువనేశ్వర్‌లో ఆడుతున్నారు. సెలవు రోజుల్లో మహబూబ్‌నగర్‌లోని ఎంవీఎస్ కళాశాల మైదానంలో సాధన చేస్తుంటారు. ‘చాలా మంది చిన్నారులు ఇతర క్రీడలు ఆడుతున్నారు. తల్లిదండ్రులు పిల్లలను ఫుట్‌బాల్ వైపు ప్రోత్సహించా’లని శశిధర్‌రెడ్డి కోరుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
WTC Final: అతడికి బౌలింగ్ చేసినా.. సచిన్‌కు చేసినా ఒకేలా భావిస్తా: వసీమ్ అక్రమ్
-
Politics News
CM KCR: ధరణి వద్దన్న వాళ్లనే బంగాళాఖాతంలో కలిపేద్దాం: సీఎం కేసీఆర్
-
India News
Odisha Train Accident: ఒడిశా రైలు దుర్ఘటన.. సీబీఐ విచారణకు రైల్వేబోర్డు సిఫారసు
-
India News
Odisha train Tragedy: లోకో పైలట్ తప్పిదం లేదు..! ‘సిగ్నల్ వ్యవస్థ’ను ఎవరు ట్యాంపర్ చేశారు..?
-
General News
CM KCR: చేయాల్సిన అభివృద్ధి చాలా ఉంది.. ఇదే పట్టుదలతో ముందుకు సాగుదాం: కేసీఆర్
-
India News
Odisha Train accident: మార్చురీల వద్దే భారీగా ‘గుర్తుపట్టని’ మృతదేహాలు.. భద్రపరచడం పెద్ద సవాలే!