logo

నిండా పూడికే !

ఆర్డీఎస్‌ ఆనకట్ట ఆధునికీకరణ చేయకపోవడంతో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన నీటి వాటాలను సక్రమంగా వినియోగించుకోలేకపోతున్నారు. ఆనకట్టలో పూడిక పెరిగిపోవడంతో పూర్తిస్థాయిలో 1.3 టీఎంసీల నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకుండా పోయింది.

Published : 02 Dec 2023 02:57 IST

న్యూస్‌టుడే, శాంతినగర్‌: ఆర్డీఎస్‌ ఆనకట్ట ఆధునికీకరణ చేయకపోవడంతో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన నీటి వాటాలను సక్రమంగా వినియోగించుకోలేకపోతున్నారు. ఆనకట్టలో పూడిక పెరిగిపోవడంతో పూర్తిస్థాయిలో 1.3 టీఎంసీల నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకుండా పోయింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని పూడిక తొలగింపు, కట్ట ఎత్తుపెంచేందుకు ప్రతిపాదనలు పంపించారు. అర, కొర నిధులు మంజూరయ్యాయి. వాటితో ఆనకట్టపైన కొంతభాగం అర అడుగు మేర కాంక్రీట్‌ పనులు చేసి వదిలివేశారు. ఆనకట్ట వద్ద పూడిక పనులు మొదలుకాలేదు. దీంతో ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరు అందడం లేదు. వచ్చే సీజన్‌ నాటికైనా దీనిని పూర్తి చేసేలా అధికారులు శ్రద్ధతీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని