logo

మనోధైర్యమే అసలు చికిత్స

ఎయిడ్స్‌ బారిన పడిన బాధితుల పట్ల వివక్ష చూపకుండా వారికి సమాజం మనోధైర్యం ఇవ్వాలని, అదే అసలైన చికిత్సని ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి గంటా కవితాదేవి పేర్కొన్నారు.

Published : 02 Dec 2023 03:03 IST

గద్వాల అర్బన్‌, న్యూస్‌టుడే: ఎయిడ్స్‌ బారిన పడిన బాధితుల పట్ల వివక్ష చూపకుండా వారికి సమాజం మనోధైర్యం ఇవ్వాలని, అదే అసలైన చికిత్సని ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి గంటా కవితాదేవి పేర్కొన్నారు. ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవాన్ని పురస్కరించి గద్వాలలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో శుక్రవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయవిజ్ఞాన సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన న్యాయమూర్తి మాట్లాడుతూ ఎయిడ్స్‌ వ్యాధి పట్ల వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు అవగాహన కల్పించాలన్నారు. వారికి సమాజం నుంచి ఎలాంటి అవరోధాలు, మానసిక వేధింపులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అందరితో సమానంగా వారిని చూడడంతో పాటు వారిలో మనో నిబ్బరం నింపాలన్నారు. వారికి ఎప్పటికప్పుడు మెరుగైన చికిత్సలు, మందుల సరఫరా, సరైన ఆహారం అందించాలన్నారు. ప్రభుత్వం నుంచి అందే పథకాలు అందేలా చూడాలన్నారు. ఇన్‌ఛార్జి డీఎంహెచ్‌వో డాక్టర్‌ శశికల, డిప్యూటీ డీఎంహెచ్‌వో సిద్ధప్ప, జిల్లా ఆస్పత్రి పర్యవేక్షకుడు డాక్టర్‌ కిషోర్‌కుమార్‌, వైద్యాధికారులు, జిల్లా అధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

మల్దకల్‌: ఎయిడ్స్‌ రహిత సమాజ నిర్మాణానికి యువత ముందుకు రావాలని వైద్యాధికారిణి స్వరూపరాణి ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారి రామాంజనేయులు అన్నారు. మల్దకల్‌ ప్రభుత్వ ఆసుపత్రి, ప్ర.జూ.కళాశాలలో వారు ప్రసంగించారు. వ్యాధి వచ్చిన తర్వాత బాధపడేకన్నా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. విద్యార్థులు, వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. శ్రీధర్‌, వెంకటస్వామి, నాగేంద్రం, రామాంజనేయులు, దేవసేనారెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని