logo

వైజ్ఞానిక ప్రదర్శనకు వేళాయె!

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని జాతీయ విద్యా పరిశోధన మండలి(ఎన్‌సీఈఆర్టీ) విద్యార్థుల్లో దాగి ఉన్న సహజమైన ఉత్సుకత, సృజనాత్మకత, నూతన ఆలోచనలను వెలికితీయడమే లక్ష్యంగా ఏటా చర్యలు చేపడుతోంది.

Published : 02 Dec 2023 03:15 IST

ఉమ్మడి జిల్లాలో ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకు అవకాశం

గద్వాల న్యూటౌన్‌, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వ పరిధిలోని జాతీయ విద్యా పరిశోధన మండలి(ఎన్‌సీఈఆర్టీ) విద్యార్థుల్లో దాగి ఉన్న సహజమైన ఉత్సుకత, సృజనాత్మకత, నూతన ఆలోచనలను వెలికితీయడమే లక్ష్యంగా ఏటా చర్యలు చేపడుతోంది. 1988 నుంచి ‘జవహర్‌లాల్‌ నెహ్రూ జాతీయ వైజ్ఞానిక, గణిత, పర్యావరణ ప్రదర్శన’(జేఎన్‌ఎన్‌ఎంఈఈ) పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతుండగా, ఈ విద్యా సంవత్సరం నుంచి దాన్ని ‘రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శిని’(ఆర్‌బీవీపీ)గా పేరు

ఉమ్మడి జిల్లాలో..: 4,200కి పైగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలున్నాయి. వీటిలో 5.50 లక్షల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో ఆరు నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఆర్‌బీవీపీలో పాల్గొనేందుకు అవకాశం ఉంది. శాస్త్రీయ దృక్పథం, ఆసక్తి ఉడటం, సృజనాత్మకతకు పదును పెట్టడం, పరిసరాలు, ప్రకృతి, పర్యావరణం, వ్యవసాయం, ఖగోళ శాస్త్రం, గణితం తదితర అంశాలపై విద్యార్థులకు పట్టు ఉంటే.. వారు ఇందులో పాల్గొనవచ్చు. ఈ మేరకు ప్రధాన అంశం, ఉప అంశాలను ఎన్‌సీఈఆర్టీ ప్రకటించగా, వీటి ఆధారంగా విద్యార్థులను సన్నద్ధం చేసి, సెమినార్‌లో పాల్గొనేలా చేయాల్సి ఉంటుంది. గతేడాది నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శనలో 8 మంది రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు.

సీనియర్‌, జూనియర్‌ విభాగాల్లో: జిల్లా స్థాయి ఆర్‌బీవీపీ కార్యక్రమం డిసెంబరు రెండో వారంలోగా పూర్తి చేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ప్రతి జిల్లాకు రూ.50 వేల నగదు జమైంది. డిసెంబరు చివరి వారంలో రాష్ట్ర స్థాయి ప్రదర్శన, జనవరిలో సౌత్‌ ఇండియా స్థాయి, ఫిబ్రవరి లేదా మార్చిలో జాతీయ స్థాయి ప్రదర్శనలో పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. ఒక పాఠశాల నుంచి జూనియర్‌, సీనియర్‌ విభాగాల్లో విద్యార్థులు పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. గ్రామీణ విద్యార్థులకు 10 శాతం ప్రత్యేక వెయిటేజీ ఉంటుంది.

అంశాల ఆధారంగా..: ఒక ప్రధాన అంశం, దానికి అయిదు ఉప అంశాలుంటాయి. వీటి ఆధారంగా ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. ‘సమాజం కోసం వైజ్ఞానిక సాంకేతికత’ ప్రధానం అంశంగా ఉంటుంది. ఉప అంశాలుగా 1.ఆరోగ్యం, 2.పర్యావరణ జీవనశైలి, 3.వ్యవసాయం, 4.కమ్యూనికేషన్‌, రవాణా, 5.కంప్యూటేషనల్‌ థింకింగ్‌ ఉంటాయి. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆయా పాఠశాలల హెచ్‌ఎంల వద్ద పేర్లు నమోదు చేయించుకొని, ప్రదర్శనకు సన్నద్ధం కావాలని గద్వాల జిల్లా సైన్సు అధికారి భాస్కర్‌ పాపన్న తెలిపారు. డీఈవో ఆదేశాలతో తేదీని ప్రకటిస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు