logo

దేవదేవుడి సన్నిధిలో సందడి

దేవదేవుడు కురుమతి రాయుడి సన్నిధి భక్తులతో సందడిగా మారింది. ఎన్నికలు ముగియడంతో భక్తుల రాక పెరుగుతోంది. శుక్రవారం స్వామి వారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు.

Updated : 02 Dec 2023 04:27 IST

చిన్నచింతకుంట, న్యూస్‌టుడే : దేవదేవుడు కురుమతి రాయుడి సన్నిధి భక్తులతో సందడిగా మారింది. ఎన్నికలు ముగియడంతో భక్తుల రాక పెరుగుతోంది. శుక్రవారం స్వామి వారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేసి తడి దుస్తులతో ఇంటి దేవుడిని దర్శనం చేసుకున్నారు. మెట్టు మెట్టుకు కొబ్బరికాయ కొట్టి, కర్పూర దీపాలు వెలిగించారు. కొండ దిగువన స్వామి వారికి దాసంగాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు .యాత్రికులతో జాతర మైదానంలోని దుకాణాలన్నీ కిటకిటలాడుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని