logo

మిరప రైతుల్లో ఆందోళన

ఆరుగాలం కష్టపడి పండించిన మిర్చి పంట చేతికి వచ్చిన సమయంలో తుపాన్‌తో రైతులు ఆందోళన చెందుతున్నారు. మూడు రోజుల నుంచి అడపాదడపా ఆకాశం మేఘావృతం కావడం జల్లులు పడుతుండటంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.

Published : 06 Dec 2023 05:22 IST

వర్ష భయంతో మిర్చిపై కవర్లు కప్పుతున్న ఎల్కూరు రైతులు

మల్దకల్‌, న్యూస్‌టుడే: ఆరుగాలం కష్టపడి పండించిన మిర్చి పంట చేతికి వచ్చిన సమయంలో తుపాన్‌తో రైతులు ఆందోళన చెందుతున్నారు. మూడు రోజుల నుంచి అడపాదడపా ఆకాశం మేఘావృతం కావడం జల్లులు పడుతుండటంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రస్తుతం మండలంలో బోర్లు, ర్యాలంపాడు ప్యాకేజీ కాల్వల కింద సాగు చేసిన మిర్చి పంటను కోసి రైతులు పొలాల్లోనే ఆరబెట్టుకున్నారు. వర్షానికి తడిస్తే మిర్చి రంగు, రుచి మారడంతో పాటు గిట్టుబాటు ధర రాక రైతులు తీవ్రంగా నష్టపోతారు. మంగళవారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతం కావడం చిరుజల్లులు కురియడంతో రైతులు కుప్పలుగా పోసి, పొలాల్లో ఆరబెట్టిన మిర్చిపై కవర్లు కప్పి కాపాడుకోవడానికి శ్రమపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని