logo

పాలమూరులో ప్రభావం అంతంతే!

శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బీఎస్పీ అభ్యర్థులు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న నడిగడ్డకు చెందిన మాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌ ముందుండి నడిపించినా ప్రజలు ఆదరించలేదు.

Updated : 06 Dec 2023 06:08 IST

డిపాజిట్లు కోల్పోయిన బీఎస్పీ అభ్యర్థులు

న్యూస్‌టుడే, మహబూబ్‌నగర్‌ పట్టణం, మహబూబ్‌నగర్‌ సాంస్కృతికం : శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బీఎస్పీ అభ్యర్థులు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న నడిగడ్డకు చెందిన మాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌ ముందుండి నడిపించినా ప్రజలు ఆదరించలేదు. సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ నియోజకవర్గంలో పోటీ చేసిన ఆయన కూడా ఓటమి పాలయ్యారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 14 నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులను బరిలో నిలబెట్టినా ఎక్కడ కూడా డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు. వారికి వేలల్లో మాత్రమే ఓట్లు వచ్చాయి. అధికార భారాసపై వ్యతిరేకత కారణంగా కాంగ్రెస్‌ పార్టీ 12 నియోజకవర్గాలను దక్కించుకుంది.

అలంపూర్‌, నాగర్‌కర్నూల్‌లో పర్వాలేదు: అలంపూర్‌ నియోజకవర్గంలో బీఎస్పీ తరఫున పోటీ చేసిన ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ సోదరుడు ప్రసన్నకుమార్‌కు 6,082 ఓట్లు వచ్చాయి. ఇక్కడ భారాస అభ్యర్థి విజయం సాధించగా, కాంగ్రెస్‌ రెండో స్థానంలో నిలిచింది. ప్రధాన పార్టీ భాజపాను వెనక్కి నెట్టి బీఎస్పీ మూడో స్థానంలో నిలిచింది. డిపాజిట్‌ మాత్రం దక్కలేదు. ఇక్కడ భాజపాకు 4,630 ఓట్లు వచ్చాయి. నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గంలో పోటీ చేసిన బీఎస్పీ అభ్యర్థి కొత్తపల్లి కుమార్‌ 4,914 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. ఈ నియోజకవర్గంలో భాజపా పోటీలో లేదు. ఇక్కడ జనసేనకు 1,955, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితికి 2,172 ఓట్లు వచ్చాయి. మిగతా చోట్ల బీఎస్పీ తక్కువ ఓట్లే వచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని