logo

పనపర్తిలో వరుస విజయాలు ముగ్గురికే

చారిత్రక నేపథ్యమున్న వనపర్తి నియోజకవర్గంలో ప్రతి ఎన్నికలో ఓటర్లు విలక్షణ తీర్పు ఇస్తున్నారు. 1952లో మొదటి సారి జరిగిన ఎన్నికలో మొదటి ఎమ్మెల్యేగా గోల్కొండ పత్రిక వ్యవస్థాపకులు, స్వాతంత్య్ర సమరయోధుడు సురవరం ప్రతాపరెడ్డి ఎన్నికయ్యారు.

Published : 06 Dec 2023 05:25 IST

వనపర్తి, న్యూస్‌టుడే : చారిత్రక నేపథ్యమున్న వనపర్తి నియోజకవర్గంలో ప్రతి ఎన్నికలో ఓటర్లు విలక్షణ తీర్పు ఇస్తున్నారు. 1952లో మొదటి సారి జరిగిన ఎన్నికలో మొదటి ఎమ్మెల్యేగా గోల్కొండ పత్రిక వ్యవస్థాపకులు, స్వాతంత్య్ర సమరయోధుడు సురవరం ప్రతాపరెడ్డి ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. 17 ఎన్నికల్లో కేవలం ముగ్గురు అభ్యర్థులు మాత్రమే వరుసగా రెండోసారీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అలా ఎన్నికైన వారిలో సంస్థానాధీశుల వంశస్థురాలు రాణికుముదినీదేవి 1962, 67లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ టిక్కెట్టు మీద పోటీ చేసి విజయం సాధించారు. తరువాత సినీనటుడు ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగు దేశం పార్టీలో చేరిన వైద్యుడు బాలకృష్ణయ్య ఆ పార్టీ తరఫున ఎన్నికల్లో నిలబడి 1983, 1985లో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఏఐసీసీ కార్యదర్శి, మాజీ మంత్రి చిన్నారెడ్డి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 1999, 2004లలో వరుసగా గెలుపొందారు. తాజా ఎన్నికల్లో పెద్దమందడి ఎంపీపీగా పనిచేసిన తూడి మేఘారెడ్డి కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసి సమీప ప్రత్యర్థి మంత్రి నిరంజన్‌రెడ్డి మీద విజయం సాధించారు. మేఘారెడ్డి మొదటి ప్రయత్నంలోనే విజేతగా నిలిచారు. మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించిన వారిలో రావులచంద్రశేఖర్‌రెడ్డి(తెదేపా) కూడా ఉన్నారు. ఆయన 1994లో మొదటి సారి పోటీ చేసి చిన్నారెడ్డిమీద విజయం సాధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని