logo

శ్రీకురుమూర్తి హుండీ ఆదాయం రూ.27.47లక్షలు

జిల్లాలో ప్రసిద్ధి చెందిన శ్రీకురుమూర్తిస్వామి క్షేత్రంలో హుండీని మంగళవారం లెక్కించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు హుండీలో సమర్పించిన కానుకలను లెక్కించగా రూ.27,47,855 ఆదాయం వచ్చినట్లు ఈవో మదనేశ్వర్‌రెడ్డి తెలిపారు.

Published : 06 Dec 2023 05:39 IST

ఆలయంలో కానుకలు లెక్కిస్తున్న భక్తులు

చిన్నచింతకుంట, న్యూస్‌టుడే : జిల్లాలో ప్రసిద్ధి చెందిన శ్రీకురుమూర్తిస్వామి క్షేత్రంలో హుండీని మంగళవారం లెక్కించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు హుండీలో సమర్పించిన కానుకలను లెక్కించగా రూ.27,47,855 ఆదాయం వచ్చినట్లు ఈవో మదనేశ్వర్‌రెడ్డి తెలిపారు. గత నెల 22న మొదటి హుండీ లెక్కించగా రూ.20,69,089 ఆదాయం వచ్చింది. ఇప్పటివరకు హుండీ ద్వారా మొత్తం రూ.48,16,944 ఆదాయం వచ్చింది. ఉత్సవాలు ముగిసినా జాతర కొనసాగుతున్నందున అమావాస్య తర్వాత మరోసారి హుండీని లెక్కించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని