logo

మార్కండేయతో మహర్దశ

బిజినేపల్లి మండలం శాయిన్‌పల్లి వద్ద రూ. 77 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న మార్కండేయ ఎత్తిపోతల పనులు పూర్తవగా, నవంబర్‌ 18న నీటిపారుదల శాఖ అధికారులు ట్రయల్‌ రన్‌ నిర్వహించారు.

Updated : 06 Dec 2023 06:07 IST

5 గ్రామాలు, 17 గిరిజన తండాలకు సాగు నీరు
బిజినేపల్లి, న్యూస్‌టుడే

మార్కండేయ ఎత్తిపోతల ట్రయల్‌రన్‌ నిర్వహిస్తున్న అధికారులు

బిజినేపల్లి మండలం శాయిన్‌పల్లి వద్ద రూ. 77 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న మార్కండేయ ఎత్తిపోతల పనులు పూర్తవగా, నవంబర్‌ 18న నీటిపారుదల శాఖ అధికారులు ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. డిసెంబర్‌ నాటికి మార్కండేయ ఎత్తిపోతల ద్వారా 5 గ్రామాలు, 17 గిరిజన తండాల రైతులకు కృష్ణా జలాలు అందిస్తామని తెలిపిన అధికారులు ఆ దిశగా పనులు శరవేగంగా పూర్తి చేశారు. దీంతో సుమారు 7వేల ఎకరాలకు సాగు నీరు అందనుందని, నీటిపారుదల శాఖ డీఈ వరప్రసాద్‌ తెలిపారు. మార్కండేయ ట్రయల్‌రన్‌ విజయవంతం కావడంతో గంగారం, శాయిన్‌పల్లి, మమ్మాయిపల్లి, లట్టుపల్లి, పోలేపల్లి, 17 గిరిజన తండాల రైతుల సాగు నీటి కష్టాలు పూర్తిగా తీరునున్నాయి.

నీటిని విడుదల ప్రారంభం: మండలంలోని 35 గ్రామలు, 21 గిరిజన తండాలకు గానూ ప్రసుత్తం కేఎల్‌ఐ కాలువల ద్వారా 30 గ్రామాలు, 4 గిరిజన తండాలకు సాగు నీరందుతోంది. మిగిలిన గ్రామాలకు సాగు నీరు అందించడమే లక్ష్యంగా శాయిన్‌పల్లిలోని మిరగలవాని చెరువు వద్ద మార్కండేయ ఎత్తిపోతల నిర్మాణానికి 2022లో శంకుస్థాపన చేశారు. 2023 డిసెంబర్‌ నాటికి పనులు పూర్తి చేసి రైతులకు సాగు నీరందిస్తామని అధికారులు పేర్కొన్నారు. అందుకు అవసరమైన రూ.77 కోట్లను విడుదల చేసి, పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. నవంబర్‌ నాటికి పనులు పూర్తి చేసిన అధికారులు, 18న ట్రయల్‌రన్‌ ఏర్పాటు చేయగా విజయవంతమైంది. దీంతో మొదట కాలువల ద్వారా శాయిన్‌పల్లి వద్ద ఉన్న ఎర్రకుంట, గంగారంలోని చిన్నకుంటలకు నీటిని విడుదల చేస్తున్నారు. డిసెంబర్‌ చివరి నాటికి అన్ని గ్రామాలకు కాలువల ద్వారా నీరు అందుతాయని అధికారులు తెలిపారు.


సాగు నీరు విడుదల చేస్తున్నాం..

మార్కండేయ నిర్మాణం పూర్తి చేసి ట్రయల్‌రన్‌ విజయవంతమైంది. ఇప్పటికే శాయిన్‌పల్లి, గంగారంలోని కుంటలకు సాగు నీటిని విడుదల చేస్తున్నాం. డిసెంబర్‌ చివరి నాటిని అన్ని గ్రామాలకు నీరందిస్తాం.

వరప్రసాద్‌, డీఈ, నీటిపారుదల శాఖ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని