logo

పారదర్శక ఎన్నికకు సహకరించాలి

మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయపార్టీల ప్రతినిధులు సహకారం అందించాలని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ కోరారు. బుధవారం కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ రాజకీయపార్టీల ప్రతినిధులతో ఉప ఎన్నిక నిర్వహణ, ఓటరు జాబితాపై సమావేశం నిర్వహించారు.

Published : 29 Feb 2024 04:23 IST

రాజకీయపార్టీల ప్రతినిధులతో సమావేశమైన కలెక్టర్‌ తేజస్‌నంద్‌లాల్‌ పవార్‌

వనపర్తి, న్యూస్‌టుడే : మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయపార్టీల ప్రతినిధులు సహకారం అందించాలని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ కోరారు. బుధవారం కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ రాజకీయపార్టీల ప్రతినిధులతో ఉప ఎన్నిక నిర్వహణ, ఓటరు జాబితాపై సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఈనెల 26న ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిందని తెలిపారు. వనపర్తి జిల్లాకు సంబంధించి స్థానిక సంస్థల ప్రతినిధులైన ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు ఓటర్లుగా ఉంటారన్నారు. పార్టీలకు ఓటరు జాబితా ఇస్తామని ఎవరిదైనా పేరు లేకున్నా, మార్పు చేర్పులున్నా ఫారం-17 ద్వారా  దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏవిధమైన ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంటుందో అదేవిధంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలోనూ ఉంటుందన్నారు. వనపర్తి జిల్లాకు సంబంధించి స్థానిక సంస్థల ఓటర్లకు జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎన్నికలు ప్రశాంతంగా పారదర్శకంగా జరిగేందుకు అందరూ సహకరించాలని కోరారు. సమావేశంలో ఆర్డీవో పద్మావతి, భారాస, కాంగ్రెస్‌, భాజపా, సీపీఎం, తెదేపా, ఎంఐఎం పార్టీల నుంచి జమీల్‌, త్రినాథ్‌, వేణాచారి, ప్రవీణ్‌, మండ్లరాజు, బాలరాజు, రహీం పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని