logo

కేసీఆర్‌ లాగే రేవంత్‌రెడ్డి పాలన: భాజపా

సీఎం రేవంత్‌రెడ్డి పాలన గత కేసీఆర్‌ పాలన మాదిరిగానే ఉందని సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ ఎమ్మెల్యే హరీశ్‌బాబు అన్నారు. విజయ సంకల్పయాత్రలో భాగంగా బుధవారం పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

Published : 29 Feb 2024 04:26 IST

సమావేశంలో మాట్లాడుతున్న భాజపా ఎమ్మెల్యే హరీశ్‌బాబు

అచ్చంపేట న్యూటౌన్‌, న్యూస్‌టుడే: సీఎం రేవంత్‌రెడ్డి పాలన గత కేసీఆర్‌ పాలన మాదిరిగానే ఉందని సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ ఎమ్మెల్యే హరీశ్‌బాబు అన్నారు. విజయ సంకల్పయాత్రలో భాగంగా బుధవారం పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భారాస, కాంగ్రెస్‌ పార్టీలు భాజాపాపై అసత్యపు ఆరోపణలు చేస్తూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారన్నారు. ప్రజాభిప్రాయం మేరకు రాష్ట్రంలో భాజాపా 8 నుంచి 12 సీట్లు గెలుస్తామని సర్వేలు చెబుతున్నాయన్నారు. కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీల పూర్తి స్థాయి అమలు పట్ల ప్రజలకు నమ్మకం లేదన్నారు. మోదీ పాలనతోనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు. రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రజలు భాజాపా అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. సమావేశంలో శ్రీవర్ధన్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌, మంగ్యానాయక్‌, నాగరాజు, రేణయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని