logo

ఎంపీపీల ఎన్నిక ఏకగ్రీవం

అయిజ మండల పరిషత్తు కార్యాలయంలో అధికారులు బుధవారం ఎంపీపీ ఎన్నిక నిర్వహించారు. ఉప్పల ఎంపీటీసీ సభ్యుడు ప్రహ్లాదరెడ్డిని ఏకగ్రీవంగా ఎంపీపీగా ఎన్నుకున్నారు. మొత్తం 16 మంది ఎంపీటీసీ స్థానాలుండగా ఉత్తనూరు ఎంపీటీసీ సభ్యుడు తిరుమల్‌రెడ్డి మృతిచెందడంతో ఎంపీటీసీ సభ్యుల సంఖ్య 15కు చేరింది.

Published : 29 Feb 2024 04:30 IST

అయిజ : ప్రహ్లాదరెడ్డికి ధ్రువీకరణ పత్రం అందజేస్తున్న ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే

అయిజ, న్యూస్‌టుడే : అయిజ మండల పరిషత్తు కార్యాలయంలో అధికారులు బుధవారం ఎంపీపీ ఎన్నిక నిర్వహించారు. ఉప్పల ఎంపీటీసీ సభ్యుడు ప్రహ్లాదరెడ్డిని ఏకగ్రీవంగా ఎంపీపీగా ఎన్నుకున్నారు. మొత్తం 16 మంది ఎంపీటీసీ స్థానాలుండగా ఉత్తనూరు ఎంపీటీసీ సభ్యుడు తిరుమల్‌రెడ్డి మృతిచెందడంతో ఎంపీటీసీ సభ్యుల సంఖ్య 15కు చేరింది. ప్రహ్లాదరెడ్డితో పాటు మిగిలిన 14 మంది సభ్యులు ప్రహ్లాదరెడ్డికి మద్దతుగా చేతులెత్తారు.ఎన్నికల అధికారి ప్రసాద్‌రావు ప్రహ్లాదరెడ్డిని ఎంపీపీగా ప్రకటించారు. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, ఎన్నికల అధికారి ప్రసాద్‌రావు చేతుల మీదుగా ఎన్నిక పత్రాన్ని అందుకున్నారు. ఎంపీడీవో వెంకటయ్య, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌లు నారాయణ, మహేశ్‌ పాల్గొన్నారు.

దక్కించుకున్న భారాస: ఎంపికపై వారం రోజుల మందు నుంచే కసరత్తు జరిగింది. మండలంలోని ఎంపీటీసీ సభ్యులు కర్నూలులోని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి స్వగృహానికి వెళ్లి చర్చించారు. 2019లో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రహ్లాదరెడ్డి ఎంపీపీ కావాలని అనుకున్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల కాలేదు. దీంతో ఇప్పుడు అవకాశం ఇవ్వాలని సభ్యుల సమక్షంలో ఆయన ఎమ్మెల్సీ చల్లాను కోరారు.

కొల్లాపూర్‌ పట్టణం : అనివార్య కారణాలతో ఖాళీగా ఉన్న కొల్లాపూర్‌ ఎంపీపీ స్థానం బుధవారం నిర్వహించిన అధ్యక్ష ఎన్నికల్లో ఏకగ్రీవమైంది. కొల్లాపూర్‌ మండల ప్రజా పరిషత్‌లో ఎంపీపీ ఎన్నిక నిర్వహించగా యన్మన్‌బెట్ల గ్రామానికి చెందిన భారాస ఎంపీటీసీ మాలే.రజితను ఎంపీటీసీ శంకర్‌నాయక్‌ ప్రతిపాదించగా రామాపురం ఎంపీటీసీ వరలక్ష్మి బలపరచింది. మిగితా వారు ఒప్పుకోవడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. ఎన్నికల అధికారి, ఉప ముఖ్య కార్యనిర్వహణ అధికారి గోపాల్‌నాయక్‌ చేతుల మీదుగా మాలే.రజిత నియామక పత్రం అందుకుంది. భారాసకు చెందిన ఎంపీటీసీల కోరం ఎక్కువగా ఉండడంతో ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. ముక్కిడిగుండానికి చెందిన కాంగ్రెస్‌ ఎంపీటీసీ భోజ్యనాయక్‌ ఎన్నికకు హాజరుకాలేదు. వైస్‌ ఎంపీపీ స్థానానికి మార్చి 1న అవిశ్వాస తీర్మానం ఉంటుందని ఎంపీడీవో పట్టాభిరామారావు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు