logo

తొలిరోజు ప్రశాంతం!

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బుధవారం ఇంటర్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద సందడి నెలకొంది. మారుమూల గ్రామాలకు చెందిన విద్యార్థులు ఉదయమే బయలుదేరి పరీక్ష సమయం కంటే ముందే చేరుకున్నారు.

Updated : 29 Feb 2024 06:11 IST

మహబూబ్‌నగర్‌ : ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో పరీక్ష కేంద్రానికి వస్తున్న విద్యార్థినులు

న్యూస్‌టుడే బృందం: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బుధవారం ఇంటర్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద సందడి నెలకొంది. మారుమూల గ్రామాలకు చెందిన విద్యార్థులు ఉదయమే బయలుదేరి పరీక్ష సమయం కంటే ముందే చేరుకున్నారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వెంట వచ్చి ధైర్యం చెప్పారు. కొందరు అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నా, గాయాల నొప్పులు తీవ్రంగా ఉన్నా పరీక్ష రాయాలన్న పట్టుదలతో వచ్చారు. తొలిరోజు పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. కేంద్రాల వద్ద చిత్రాలు ఇవి.

నొప్పి బాధిస్తున్నా లెక్కచేయక..

చిత్రంలో కుటుంబ సభ్యుల సాయంతో ఇంటర్‌ పరీక్ష రాయడానికి వస్తున్న విద్యార్థిని పేరు శైలజ. వనపర్తి జిల్లా ఖిల్లాగణపురం మండలం ఈర్లతండా స్వగ్రామం. మహబూబ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతోంది. సోమవారం శైలజకు అపెండిసైట్స్‌ శస్త్రచికిత్స చేశారు. వైద్యులు వారం పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. సంవత్సరం పాటు కష్టపడి చదివిన శైలజ మాత్రం పరీక్ష రాయడానికే నిర్ణయించుకుంది. నొప్పి బాధిస్తున్నా లెక్క చేయకుండా కుటుంబ సభ్యుల సాయంతో ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో పరీక్ష రాయడానికి వచ్చింది. ఆ దృశ్యాన్ని ‘ఈనాడు’ క్లిక్‌మనిపించింది. 

     

వనపర్తి : డీసీఎంలో పరీక్ష కేంద్రానికి వచ్చిన గిరిజన గురుకుల విద్యార్థినులు

నాగర్‌కర్నూల్‌ : ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల వద్ద హాల్‌టిక్కెట్ల సంఖ్యలు చూసుకుంటున్న విద్యార్థినులు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని