logo

మొదటి రోజు ఇంటర్‌ పరీక్షలకు 96.29 % హాజరు

ఇంటర్‌ వార్షిక పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు 11,467 మంది ప్రథమ సంవత్సరం విద్యార్థులకు గాను 11,040 మంది పరీక్ష రాశారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించమనే నిబంధన ఉండటంతో పాటు ఉదయం 8.00 గంటలకే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలనే ఇంటర్‌ బోర్డు అధికారుల సూచనలు విద్యార్థులు పాటించారు.

Published : 29 Feb 2024 04:49 IST

 

జడ్చర్ల: ప్రభుత్వ జూనియర్‌ కళాశాల పరీక్ష కేంద్రంలో విద్యార్థులు

న్యూస్‌టుడే, మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం, జడ్చర్ల పట్టణం : ఇంటర్‌ వార్షిక పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు 11,467 మంది ప్రథమ సంవత్సరం విద్యార్థులకు గాను 11,040 మంది పరీక్ష రాశారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించమనే నిబంధన ఉండటంతో పాటు ఉదయం 8.00 గంటలకే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలనే ఇంటర్‌ బోర్డు అధికారుల సూచనలు విద్యార్థులు పాటించారు. దూర ప్రాంత విద్యార్థులు నిర్దేశిత సమయం కంటే రెండు, మూడు నిమిషాల ముందే కేంద్రాలకు చేరటంతో వారు పరుగులు పెట్టాల్సి వచ్చింది. విద్యార్థులు కేంద్రంలోకి వచ్చిన వెంటనే వారికి వివరాలు తెలియజేసి సకాలంలో పరీక్ష గదిలోకి వెళ్లేలా కళాశాలల ప్రిన్సిపల్స్‌, అధ్యాపకులు, సిబ్బంది కృషిచేశారు. జిల్లా ఇంటర్‌ విద్యాధికారి డా.శ్రీధర్‌ సుమన్‌ కేంద్రాలను తనిఖీ చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్రాల సమీపంలో నిరీక్షించిన విద్యార్థుల తల్లిదండ్రులు ఎండలో ఇబ్బందులు పడ్డారు. చాలా కేంద్రాల్లో మంచినీటిని కూడా అందుబాటులో ఉంచలేదు. జిల్లాలో 33 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. మొదటి రోజు తెలుగు, హిందీ, సంస్కృతం, ఉర్దూ, అరబిక్‌ పరీక్షలు జరగగా జనరల్‌ కేటగిరీలో 9,080, ఒకేషనల్‌ కేటగిరీలో 1,960 మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లా ఇంటర్‌ విద్యాధికారి, డీఈసీ సభ్యులు ఉమామహేశ్వర్‌, రవీందర్‌, సూపరింటెండెంట్‌ సందీప్‌రెడ్డి కేంద్రాలను తనిఖీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు