logo

నిబంధనల ప్రకారం పని చేయండి

ఉపాధి హామీ పథకంలో పనులు చేసే కూలీలు నిబంధనల ప్రకారం పని చేయాలని వనపర్తి డీఆర్‌డీవో ఉమాదేవి అన్నారు.

Published : 29 Feb 2024 14:12 IST

పాన్‌గల్‌: ఉపాధి హామీ పథకంలో పనులు చేసే కూలీలు నిబంధనల ప్రకారం పని చేయాలని వనపర్తి డీఆర్‌డీవో ఉమాదేవి అన్నారు. గురువారం పాన్‌గల్ మండలంలోని అన్నారం, తండా, గోపులాపూర్ గ్రామాలలో ఆమె పర్యటించారు. గ్రామాలలో నర్సరీలను ఉపాధి పనులను పరిశీలించారు. కూలీలు పనిచేసే చోట మంచినీటి వసతి కల్పించాలని పంచాయతీ కార్యదర్శులకు  సూచించారు. గోపులాపూర్ గ్రామంలో ఆసరా పింఛన్ల పంపిణీని  తనిఖీ చేశారు. పింఛను తీసుకున్న లబ్ధిదారులకు ఎప్పటికప్పుడు రసీదులు ఇవ్వాలని బీపీఎంకు ఆదేశించారు. ఆమెతోపాటు ఎంపీడీవో కోటేశ్వర్, ఏపీవో కురుమయ్య, ఆయా గ్రాముల ఉపాధి సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని