logo

Harish Rao: మీ కోసం 18 గంటలు శ్రమిస్తున్నా: మంత్రి హరీశ్‌

‘సిద్దిపేట ప్రజలే నా కుటుంబం. మీకోసం రోజులో 18 గంటలు శ్రమిస్తున్నా. నేను ఎక్కడున్నా ఇక్కడికి వస్తేనే తృప్తిగా ఉంటుంది. మరింత సేవ చేసేందుకు ప్రేమ, ఆశీర్వాదం అందించాలి..’ అని మంత్రి హరీశ్‌రావు అన్నారు.

Updated : 07 Oct 2023 09:28 IST

మరింత సేవ చేసేందుకు ఆశీర్వదించండి: మంత్రి హరీశ్‌రావు

బ్యాడ్మింటన్‌ ఆడుతున్న హరీశ్‌రావు

సిద్దిపేట, సిద్దిపేట టౌన్‌, న్యూస్‌టుడే: ‘సిద్దిపేట ప్రజలే నా కుటుంబం. మీకోసం రోజులో 18 గంటలు శ్రమిస్తున్నా. నేను ఎక్కడున్నా ఇక్కడికి వస్తేనే తృప్తిగా ఉంటుంది. మరింత సేవ చేసేందుకు ప్రేమ, ఆశీర్వాదం అందించాలి..’ అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం రాత్రి సిద్దిపేటలో రూ.లక్ష చొప్పున బీసీ బంధు చెక్కులను నియోజకవర్గంలోని 400 మంది లబ్ధిదారులకు అందించారు. గృహలక్ష్మి పథకం కింద మరో 400 మందికి మంజూరు ఉత్తర్వులు పంపిణీ చేశారు. చిన్నకోడూరు మండల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పట్టాలు అందజేశారు. వెట్టిచాకిరి విముక్తి కింద బాధితులకు స్థల పట్టాలు, కుల సంఘ భవనాలకు నిధులు మంజూరు చేస్తూ ప్రతులను అందజేసి మాట్లాడారు. దేశానికి తెలంగాణ నమూనా అయితే.. రాష్ట్రానికి సిద్దిపేట అని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ ఆశీస్సులతో ఈ ప్రాంత గౌరవాన్ని ఇనుమడింపజేశామన్నారు. జిల్లా పాలనాధికారి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అత్యధిక బీసీ బంధు సాయం అందించిన జాబితాలో సిద్దిపేట జిల్లా మొదటిస్థానంలో ఉందన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్‌, మున్సిపల్‌ అధ్యక్షురాలు మంజుల, సుడా ఛైర్మన్‌ రవీందర్‌రెడ్డి, రాష్ట్ర నర్సింగ్‌ కౌన్సిల్‌ సభ్యుడు పాల సాయిరాం, మాజీ ఛైర్మన్‌ రాజనర్సు, సుడా డైరెక్టర్‌ మచ్చ వేణుగోపాల్‌, ఎస్సీ, బీసీ అభివృద్ధి శాఖల అధికారులు శ్రీరాంరెడ్డి, హరికృష్ణ, ప్రజాప్రతినిధులు, నాయకులు ఉన్నారు.

క్రీడాభివృద్ధికి పెద్దపేట

క్రీడాభివృద్ధికి పెద్దపీట వేస్తూ ఇప్పటి వరకు రూ.11 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. స్పోర్ట్స్‌ క్లబ్‌ కోరిక మేరకు కబడ్డీ, ఖోఖో కోర్టులు, రన్నింగ్‌ ట్రాక్‌ త్వరలో మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. సిద్దిపేటలోని లఘు క్రీడా మైదానం వద్ద రూ.1.50 కోట్లతో నిర్మించిన బాస్కెట్‌బాల్‌, షటిల్‌ బ్యాడ్మింటన్‌ కోర్టులను టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ ఛైర్మన్‌ రావుల శ్రీధర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. నెలన్నర వ్యవధిలో రెండు కోర్టులను నిర్మించి ప్రారంభించేందుకు కృషి చేసిన శ్రీధర్‌రెడ్డిని అభినందించారు. బ్యాడ్మింటన్‌ ఆడారు. వాలీబాల్‌ అకాడమీలో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ధ్రువపత్రాలు అందజేశారు. సిద్దిపేట స్పోర్ట్స్‌ క్లబ్‌ కన్వీనర్‌ పాల సాయిరాం, బాస్కెట్‌ బాల్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు మన్నె మహేశ్‌కుమార్‌, కార్యదర్శి వంశీ ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని