logo

TSRTC: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమేనా?

‘ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం.. సుఖప్రదం’ అనేది సంస్థ నినాదం. టైరు ఊడిపడిన ఘటనను బట్టి సురక్షితమేనా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. కోహెడ మండలంలోని నకిరేకొమ్ములలో పల్లె వెలుగు మినీ బస్సు టైరు ఆదివారం ఊడింది.

Updated : 18 Dec 2023 08:13 IST

కోహెడ గ్రామీణం, న్యూస్‌టుడే: ‘ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం.. సుఖప్రదం’ అనేది సంస్థ నినాదం. టైరు ఊడిపడిన ఘటనను బట్టి సురక్షితమేనా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. కోహెడ మండలంలోని నకిరేకొమ్ములలో పల్లె వెలుగు మినీ బస్సు టైరు ఆదివారం ఊడింది. హుస్నాబాద్‌ నుంచి కోహెడ మీదుగా కరీంనగర్‌ వెళుతోంది. నకిరేకొమ్ములలో బస్సు టైరు ఊడిపోయింది. పక్కనే ఉన్న పత్తి చేనులో పడిపోయింది.

బస్సులో ప్రయాణిస్తున్న పది మంది ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. వాహనాన్ని సరిగా పరీక్షించకుండానే వదులుతున్నారని ప్రయాణికులు ఆరోపించారు. హుస్నాబాద్‌ ఆర్టీసీ డిపో మేనేజర్‌ వెంకటేశ్వర్లను అడుగగా ప్రయాణికులను వేరే బస్సులో పంపించామని తెలిపారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని.. జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని