logo

గ్యాస్‌ సిలిండర్ల బాయ్స్‌ ఇద్దరిపై కేసు.. డీలర్‌షిప్‌ బదిలీ

రాయపోల్‌లో కొన్నాళ్లుగా జరుగుతున్న వంట గ్యాస్‌ అక్రమ వ్యవహారాలపై అధికారులు చర్యలు తీసుకున్నారు. అభివర్షన్‌ భారత్‌ గ్యాస్‌ గోదాం సంబంధించి డీలర్‌షిప్‌ను కొండపాక ఏజెన్సీకి బదిలీ చేశారు.

Published : 16 Apr 2024 01:17 IST

రాయపోల్‌: రాయపోల్‌లో కొన్నాళ్లుగా జరుగుతున్న వంట గ్యాస్‌ అక్రమ వ్యవహారాలపై అధికారులు చర్యలు తీసుకున్నారు. అభివర్షన్‌ భారత్‌ గ్యాస్‌ గోదాం సంబంధించి డీలర్‌షిప్‌ను కొండపాక ఏజెన్సీకి బదిలీ చేశారు. ఇద్దరు సిలిండర్ల బాయ్స్‌పై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. డీలర్లు అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని సోమవారం తనిఖీలకు వచ్చిన జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారిణి తనూజ చెప్పారు. గోదాంలో కమర్షియల్‌ సిలిండర్లలోకి డొమెస్టిక్‌ గ్యాస్‌ నింపుతూ.. వినియోగదారులను మోసం చేస్తున్న వ్యవహారాన్ని ఆదివారం పోలీసులు బట్టబయలు చేసిన విషయం తెలిసిందే. సిబ్బందితో కలిసి వచ్చిన ఆమె గ్యాస్‌ గోదాంలో తనిఖీలు చేపట్టారు. 75 కమర్షియల్‌ సిలిండర్లు, 561 డొమెస్టిక్‌వి స్వాధీనం చేసుకున్నారు. తమకు తెలియకుండా డెలివరీ బాయ్స్‌ అక్రమ చర్యలకు పాల్పడ్డారని రాయపోల్‌ డీలర్‌ తెలిపారు. భారత్‌ ఆయిల్‌ కంపెనీకి లేఖ ద్వారా తెలియజేశామని తనూజ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని