logo

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో చర్యలపై జాప్యమెందుకు?

రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బాధ్యులపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని భాజపా మెదక్‌ పార్లమెంట్‌ అభ్యర్థి రఘునందన్‌రావు ప్రశ్నించారు.

Published : 16 Apr 2024 01:56 IST

మెదక్‌ పార్లమెంట్‌ భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు

తూప్రాన్‌, గజ్వేల్‌- న్యూస్‌టుడే: రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బాధ్యులపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని భాజపా మెదక్‌ పార్లమెంట్‌ అభ్యర్థి రఘునందన్‌రావు ప్రశ్నించారు. సోమవారం తూప్రాన్‌, గజ్వేల్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. మెదక్‌ భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి శాసన సభ ఎన్నికల్లో రాజ్‌పుష్ప అనే పరిశ్రమ నుంచి పోలీసుల వాహనాల్లో నగదు తరలించారని స్వయంగా పోలీసుల అదుపులో ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు చెప్పినా ఎందుకు కేసు పెట్టడం లేదన్నారు. వెంకట్రామిరెడ్డి మంత్రి పొంగులేటికి బంధువు కావడంతోనే చర్యలు తీసుకోవడం లేదా.. అని ప్రశ్నించారు. కేసీఆర్‌కు మోకరిల్లితే ఆయనకు ఎమ్మెల్సీ పదవి వచ్చిందన్నారు. జిల్లాలోని ప్రాజెక్టుల నిర్మాణంలో రూ.కోట్లు దోచుకున్నారన్నారు. ఎమ్మెల్సీ కవిత కొందరి వద్ద రూ.కోట్లు దోచుకున్నారని కొన్ని పత్రికల్లో వచ్చిందని.. పోలీసులు ఎందుకు కేసులు పెట్టడం లేదన్నారు. ఆమె బాటలోనే మరికొందరు జైలుకు వెళ్లనున్నారన్నారు. భారాస, కాంగ్రెస్‌ కలిసి రాష్ట్రంలో భాజపా అభ్యర్థులను ఓడించేందుకు కుట్ర పన్నాయన్నారు. గెలవగానే రూ.4వేల పింఛన్‌ ఇస్తానన్న సీఎం రేవంత్‌రెడ్డి లంకె బిందెల గురించి మాట్లాడుతున్నారన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ ఏమైందన్నారు. కార్యక్రమంలో నాయకులు మనోహర్‌యాదవ్‌, నందన్‌గౌడ్‌, భూమన్నగారి జానకిరామ్‌గౌడ్‌, నత్తి మల్లేశ్‌, పిట్ల పోచయ్య, తాటి విఠల్‌, నర్సోజీ, సాయిబాబాగౌడ్‌, మహేశ్‌గౌడ్‌, సిద్దిరాములు, నర్సింహరెడ్డి, కార్తీక్‌, శరత్‌ ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని