logo

మహిళ హత్య కేసు నిందితుడికి జీవిత ఖైదు

మహిళలను హతమార్చి బంగారం, వెండి ఆభరణాలు దొంగిలించే పాత నేరస్థుడికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది.

Published : 17 Apr 2024 03:15 IST

పది ఘాతుకాలకు పాల్పడినట్లు వెల్లడి

పటాన్‌చెరు అర్బన్‌, న్యూస్‌టుడే: మహిళలను హతమార్చి బంగారం, వెండి ఆభరణాలు దొంగిలించే పాత నేరస్థుడికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. పటాన్‌చెరు ఠాణా పరిధిలో ఓ మహిళను హత్యచేసిన కేసులో ఈ శిక్ష పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్ది జిల్లా కంది మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన రాములు 2019 జులై 11న చేవెళ్ల బస్టాండ్‌లో ఉన్న మహబూబ్‌నగర్‌ జిల్లా గందీడ్‌ మండలం నాంచర్ల గ్రామానికి చెందిన అంజులమ్మ అనే మహిళను తన ద్విచక్ర వాహనంపై ఎక్కించుకున్నాడు. పటాన్‌చెరు మండలం లక్డారం గ్రామం లింగసానికుంట వద్దకు తీసుకొచ్చి ఆమె గొంతు నులిమి హత్య చేసి ఆమె వద్ద ఉన్న రూ.120, ఒక సెల్‌ఫోన్‌ దొంగలించుకుపోయాడు. దీనిపై కేసు నమోదు చేసిన పటాన్‌చెరు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో వివిధ ఠాణాల పరిధుల్లో 2003-2019 వరకూ పది హత్యలు, మూడు దొంగతనాలు చేసినట్లు అంగీకరించాడు. ప్రతీసారి మహిళలను లక్ష్యంగా చేసుకుని వారిని హత్య చేసి వారి వద్ద ఉన్న బంగారం, వెండి ఆభరణాలు దొంగిలించుకుని పోయాడు. ఆల్విన్‌ కాలనీ మహంకాళి దేవాలయంలో అమ్మవారి మెడలో 10 గ్రాముల బంగారు గొలుసు సైతం ఎత్తుకెళ్లాడు. నిందితుడిని సంగారెడ్డి రెండో అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ సెషన్స్‌ కోర్టులో హాజరపరచగా నిందితుడికి జీవిత ఖైదు, రూ.3 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి పీపీ కృష్ణార్జున్‌ తీర్పునిచ్చారు. రూ.3వేలు చెల్లించని పక్షంలో మరో మూడు నెలలు జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని