logo

భారాస నియోజకవర్గ సమన్వయకర్తలు వీరే

మెదక్‌, జహీరాబాద్‌ పార్లమెంట్‌ స్థానాల పరిధిలోని నియోజకవర్గాలకు భారాస సమన్వయకర్తలను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ మంగళవారం ప్రకటించారు.

Published : 17 Apr 2024 03:25 IST

మెదక్‌, సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌టుడే: మెదక్‌, జహీరాబాద్‌ పార్లమెంట్‌ స్థానాల పరిధిలోని నియోజకవర్గాలకు భారాస సమన్వయకర్తలను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ మంగళవారం ప్రకటించారు. మెదక్‌ పార్లమెంట్‌ స్థానం పరిధిలో.. సంగారెడ్డి- ఎర్రోళ్ల శ్రీనివాస్‌, పటాన్‌చెరు-మాజీ ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, నర్పాపూర్‌-మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ యాదవరెడ్డి, మెదక్‌-డీసీసీబీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు దేవేందర్‌రెడ్డి, దుబ్బాక-మనోహర్‌రావు, గజ్వేల్‌- జడ్పీ ఛైర్‌పర్సన్‌ రోజాశర్మ, సిద్దిపేట- మాజీ ఎమ్మెల్సీ ఫారుక్‌ హుస్సేన్‌లను నియమించారు. జహీరాబాద్‌ పార్లమెంట్‌ స్థానం పరిధిలో జహీరాబాద్‌- దేవీ ప్రసాద్‌, అందోలు- డీసీసీబీ ఉపాధ్యక్షుడు మాణిక్యం, నారాయణఖేడ్‌- మఠం భిక్షపతిలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని