logo

నకిలీ పత్రాలు సృష్టించి.. యజమానిగా నటించి

కాలనీల్లో ఖాళీగా ఉన్న స్థలాలే లక్ష్యం చేసుకొని నకిలీ పత్రాలతో అమ్మకాలు సాగిస్తున్న ఆరుగురు ముఠా సభ్యులు కటకటాలపాలయ్యారు. ఎస్పీ రూపేష్‌కుమార్‌ తెలిపిన వివరాలు.. కర్ణాటకకు చెందిన పరమేశ్వరయ్య 1988లో అమీన్‌పూర్‌ పురపాలక పరిధి శ్రీవాణినగర్‌లో 120 గజాల స్థలాన్ని కొన్నారు.

Published : 21 Apr 2024 01:03 IST

స్థలం కొన్న వ్యక్తిని బెదిరించిన ఆరుగురికి రిమాండ్‌ 

పటాన్‌చెరు, న్యూస్‌టుడే: కాలనీల్లో ఖాళీగా ఉన్న స్థలాలే లక్ష్యం చేసుకొని నకిలీ పత్రాలతో అమ్మకాలు సాగిస్తున్న ఆరుగురు ముఠా సభ్యులు కటకటాలపాలయ్యారు. ఎస్పీ రూపేష్‌కుమార్‌ తెలిపిన వివరాలు.. కర్ణాటకకు చెందిన పరమేశ్వరయ్య 1988లో అమీన్‌పూర్‌ పురపాలక పరిధి శ్రీవాణినగర్‌లో 120 గజాల స్థలాన్ని కొన్నారు. ఆయన 2023 జనవరిలో మహేష్‌గౌడ్‌కు అమ్మారు. ఖాళీగా ఉన్న ఆ స్థలంపై తిరుపతిరాథోడ్‌, దేవేందర్‌రెడ్డి, రవిగౌడ్‌, దుర్గాప్రసాద్‌, సుబ్బారావు, జాన్‌స్టన్‌ స్టీఫెన్‌సన్‌లు కన్నేశారు. స్టీఫెన్‌సన్‌ పరమేశ్వరయ్యగా నటిస్తూ ఆధార్‌కార్డు, ఓటరు ఐడీ, ఏలూరులో చదివినట్టు పాఠశాల టీసీ, స్థలానికి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. తర్వాత స్థలం మాదంటూ కోర్టులో కేసు వేశారు. మహేష్‌గౌడ్‌ ఆ స్థలంలోకి ప్రవేశించే ప్రయత్నం చేయగా.. ఆరుగురు అడ్డుకున్నారు. దీంతో అతను గతేడాది మార్చిలోనే పోలీసులను ఆశ్రయించారు. రూ.20లక్షలిస్తే కోర్టు నుంచి కేసు విత్‌డ్రా చేస్తామంటూ మహేష్‌గౌడ్‌ను ఆరుగురు బెదిరించారు. మహేష్‌గౌడ్‌ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో విచారణ జరిపారు. ఆరుగురి నకిలీ వ్యవహారాన్ని బట్టబయలు చేశారు. శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని