logo

తెలంగాణ ప్రజల ఆకాంక్షలు కేసీఆర్‌కే తెలుసు

తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు కేసీఆర్‌కు తెలిసినంతగా ఎవరికీ తెలియవని మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.

Published : 21 Apr 2024 01:04 IST

మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి 

మాట్లాడుతున్న పోచారం, చిత్రంలో గాలి అనిల్‌కుమార్‌, గంప గోవర్ధన్‌, మంజుశ్రీ తదితరులు

సంగారెడ్డి టౌన్‌, న్యూస్‌టుడే: తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు కేసీఆర్‌కు తెలిసినంతగా ఎవరికీ తెలియవని మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం జహీరాబాద్‌ పార్లమెంట్‌ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌ నామినేషన్‌ దాఖలు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంగారెడ్డి కలెక్టరేట్‌ మీడియా పాయింట్‌ వద్ద విలేకర్లతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ ఆచరణ సాధ్యంకాని హామీలతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. 100 రోజుల్లో హామీల అమలు చేస్తామని చెప్పి మాట తప్పిందన్నారు. ప్రజలకు కాంగ్రెస్‌పై విశ్వాసం సన్నగిల్లుతోందన్నారు. ఆగస్టు 15లోగా పంట రుణ మాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెబుతుంటే.. రుణ మాఫీ అమలుకు నిర్దేశిత గడువు చెప్పలేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారని ఆరోపించారు. అబద్ధాలతో మరోసారి మోసం చేయాలని చూస్తున్న కాంగ్రెస్‌కు ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న భాజపా విభజన హామీలను అమలు చేయలేదన్నారు. నిధుల కేటాయింపులోనూ తెలంగాణకు అన్యాయం చేసిందని ఆరోపించారు. స్వల్ప కాలంలోనే రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. జహీరాబాద్‌ ఎంపీగా గాలి అనిల్‌కుమార్‌ ఘన విజయం సాధించడం ఖాయమన్నారు. కార్యక్రమంలో జహీరాబాద్‌ పార్లమెంట్‌ భారాస అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌, జడ్పీ అధ్యక్షురాలు మంజుశ్రీ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు