logo

ఎన్నికల ఉపాధి దరవు

ఎన్నికలనగానే వివిధ రంగాలకు ఉపాధి లభిస్తుంది. అందులో ముందు వరుసలో ఉండేది డప్పు కళాకారులే. ర్యాలీలు, సభలు, రోడ్డు షోలు.. ఇలా ఏదైనా వీరి దరువు వినిపించాల్సిందే.

Published : 21 Apr 2024 01:09 IST

ఎన్నికలనగానే వివిధ రంగాలకు ఉపాధి లభిస్తుంది. అందులో ముందు వరుసలో ఉండేది డప్పు కళాకారులే. ర్యాలీలు, సభలు, రోడ్డు షోలు.. ఇలా ఏదైనా వీరి దరువు వినిపించాల్సిందే. అగ్రనేతల పర్యటనల్లో సైతం డప్పు కళాకారులే ముందుంటారు. ప్రచారంలోనూ వీరి సందడి కనిపిస్తుంటుంది. తాజాగా లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ షురూ కాగా వీరికి ఉపాధి లభిస్తోంది. కళాకారులు డప్పులను వాయిస్తూ ముందు నడుస్తుంటే వారి వెనుక నాయకులు, కార్యకర్తలు జెండాలతో ర్యాలీగా వెళ్తుంటారు. పార్టీల నాయకులు ఇప్పటికే డప్పు కళాకారులకు అడ్వాన్స్‌ చెల్లించి బుక్‌ చేసుకోవడం గమనార్హం. ఎన్నికల ప్రచారం ముగిసే వరకు వీరికి రెండు చేతుల నిండా ఉపాధి దొరకడం ఖాయం.

 న్యూస్‌టుడే, తాండూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని