logo

షో అదిరింది..!

నల్గొండ, భువనగిరి అనగానే సర్వాయి పాపన్నగౌడ్‌, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, రావి నారాయణరెడ్డి, బద్దం నర్సింహారెడ్డి, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల దంపతులు, ధర్మభిక్షం, కొండా లక్ష్మణ్‌, బెల్లి లలిత తదితరులు గుర్తుకు వస్తారని.

Published : 22 Apr 2024 01:42 IST

భువనగిరి రోడ్‌షోలో అభివాదం చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి, నాయకులు

ఈనాడు, నల్గొండ - న్యూస్‌టుడే, భువనగిరి : నల్గొండ, భువనగిరి అనగానే సర్వాయి పాపన్నగౌడ్‌, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, రావి నారాయణరెడ్డి, బద్దం నర్సింహారెడ్డి, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల దంపతులు, ధర్మభిక్షం, కొండా లక్ష్మణ్‌, బెల్లి లలిత తదితరులు గుర్తుకు వస్తారని.. భువనగిరి గడ్డ కాంగ్రెస్‌ అడ్డా అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. పార్టీ లోక్‌సభ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డికి మద్దతుగా ఆదివారం భువనగిరి పట్టణంలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు.ఎండ భారీగా ఉన్నా సభ విజయవంతం కావడంతో నేతలు హర్షం వ్యక్తం చేశారు. సీఎం ప్రసంగంలో రుణమాఫీ విషయం చెప్పినపుడు భారీ స్పందన వచ్చింది. తన ప్రసంగంలో ముఖ్యమంత్రి కోమటిరెడ్డి సోదరులపై ప్రశంసలు కురిపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని