logo

దివ్యాంగుడి కోటాలో.. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కొనసాగుతూ..

వికారాబాద్‌ జిల్లా తాండూరు మండలంలోని ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో  దివ్యాంగుడి కోటాలో ఓ వ్యక్తి ఉపాధ్యాయుడిగా కొనసాగారు. సదరు వ్యక్తికి వైకల్యం లేకున్నా, 2012 డీఎస్సీలో 36 మార్కులతో దివ్యాంగ కోటా కింద విధుల్లో చేరారు.

Updated : 22 Apr 2024 06:14 IST

తాండూరుగ్రామీణ: వికారాబాద్‌ జిల్లా తాండూరు మండలంలోని ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో  దివ్యాంగుడి కోటాలో ఓ వ్యక్తి ఉపాధ్యాయుడిగా కొనసాగారు. సదరు వ్యక్తికి వైకల్యం లేకున్నా, 2012 డీఎస్సీలో 36 మార్కులతో దివ్యాంగ కోటా కింద విధుల్లో చేరారు. దీనికి సంబంధించి ధ్రువీకరణ పత్రం సమర్పించాలని హెచ్‌ఎం కోరితే నేడురేపు అంటూ దాటవేశారు. చేరిన సమయంలో సర్వీసు పుస్తకాల్లో అప్పటి ప్రధానోపాధ్యాయుడు సంతకం చేయలేదని సమాచారం. అనంతరం 2018లో బంధువైన వైద్యుని ద్వారా 63 శాతం వైకల్యం ఉన్నట్లు ధ్రువీకరణ పత్రం పొందారు. గతేడాది ప్రభుత్వం బదిలీలకు దరఖాస్తు చేయాలని సూచించగా, తనకు వైకల్యం లేనట్లు సదరు ఉపాధ్యాయుడు ఆన్‌లైన్‌లో స్వీయ ధ్రువీకరణ చేసినట్లు తెలిసింది. కారణమేమిటంటే బదిలీల సమయంలో ప్యానెల్‌ బోర్డు వైద్యుల బృందం దివ్యాంగులకు ప్రత్యేక పరీక్షలు చేసి నిర్ధారించనున్నారు. తన విషయం బయట పడుతుందని భావించి సాధారణ బదిలీకి దరఖాస్తు చేసినట్లు తెలిసింది. అయితే వైకల్యం కోటా ద్వారా ప్రతి నెలా రూ.3వేలకుపైగా అలవెన్సులు, ఏటా రూ.75వేల దాకా ఆదాయపు పన్ను మినహాయింపు పొందుతున్నారు. సదరు ఉపాధ్యాయుడి గురించి సిబ్బందికి, ఓ ప్రధానోపాధ్యాయునికి తెలిసినా కొన్నేళ్లుగా మిన్నకున్నారు. ప్రస్తుతం సదరు ప్రధానోపాధ్యాయుడు బదిలీపై వేరే మండలానికి వెళ్లిపోయినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని