logo

వెంకట్రామిరెడ్డికి పోటీ చేసే అర్హత లేదు

చట్టాలు, కోర్టులపై ఏమాత్రం గౌరవం లేని మాజీ కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డికి చట్టసభకు ఎంపీగా వెళ్లే అర్హత ఏమాత్రం లేదని మల్లన్నసాగర్‌ నిర్వాసిత గ్రామాల ప్రతినిధులు..

Published : 22 Apr 2024 02:03 IST

మాట్లాడుతున్న నిర్వాసిత గ్రామస్థులు

గజ్వేల్‌, న్యూస్‌టుడే: చట్టాలు, కోర్టులపై ఏమాత్రం గౌరవం లేని మాజీ కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డికి చట్టసభకు ఎంపీగా వెళ్లే అర్హత ఏమాత్రం లేదని మల్లన్నసాగర్‌ నిర్వాసిత గ్రామాల ప్రతినిధులు హయతుద్దీన్‌, శ్రీనివాస్‌రెడ్డి, ఆశోక్‌, బాల్‌రెడ్డి, కృష్ణ, మధుసూదన్‌రెడ్డి, తిరుపతి, బాల్‌రెడ్డి, ఎంకె రెడ్డి స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని ప్రెస్‌క్లబ్‌లో వారు విలేకరుల సమావేశాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ.. సిద్దిపేట కలెక్టర్‌గా ఉన్నప్పుడు వెంకట్రామిరెడ్డి.. ఒంటెద్దు పోకడలతో అప్పటి ప్రభుత్వ పెద్దల దృష్టిలో పడేందుకు మల్లన్నసాగర్‌ నిర్వాసితుల ఉసురు పోసుకున్నారన్నాని విమర్శించారు. ఆయన ఎంపీగా గెలిచి రూ.100 కోట్ల నిధితో ఉద్ధరిస్తామంటే ప్రజలు నమ్మేస్థితిలో లేరన్నారు. అన్ని సౌకర్యాలు కల్పిస్తామని నమ్మబలికి నాడు తమను బలవంతంగా ఊళ్లు ఖాళీ చేయించి రెండు పడక గదుల ఇళ్లలో తాత్కాలికంగా నివాసం కల్పించారన్నారు. మూడేళ్లయినా తమకు ఖాళీ స్థలాలు.. ఇంటి నిర్మాణానికి రూ.5.04 లక్షలు ఇవ్వలేదని వాపోయారు. తమ సమస్యలు తీర్చిన వెంటనే రెండు పడక గదుల ఇళ్లను ఖాళీ చేస్తామని అప్పటి వరకు ఇబ్బందులు పెట్టవద్దని కోరుతున్నామన్నారు. అద్భుతమైన కాలనీలు కట్టించామని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రచారం చేయటం హాస్యాస్పదమన్నారు. నిర్వాసితుల పక్షాన కొట్లాడి పోలీసు దెబ్బలు తిన్న వంటేరు ప్రతాప్‌రెడ్డి కూడా హరీశ్‌రావు పక్కనే ఉన్నా ఏమీ మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. కొందరు అధికారులు ప్రస్తుత ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలా యత్నిస్తుండటాన్ని మానుకోవాలని సూచించారు. వెంకట్రామిరెడ్డి నైతిక బాధ్యత వహిస్తూ పోటీ నుంచి తప్పుకోకుంటే పోలింగ్‌ నాటికి ఆయన చిట్టా ప్రజలు ముందు ఉంచుతామని హెచ్చరించారు. ఆయన చేసిన ప్రజా వ్యతిరేక పనులన్నీ ప్రస్తుత మంత్రి దామోదర్‌ రాజనర్సింహకు తెలుసు కాబట్టే ఆయన సహాయంతో ముందుకు సాగుతున్నామని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని