logo

భాజపా బహిరంగ సభకు సర్వం సిద్ధం

సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం నిర్వహించనున్న భాజపా ఎన్నికల శంఖరావ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు

Published : 25 Apr 2024 02:28 IST

 ఏర్పాట్ల పరిశీలనలో రఘునందన్‌రావు, నాయకులు
సిద్దిపేట అర్బన్‌, సిద్దిపేట, సిద్దిపేట టౌన్‌, న్యూస్‌టుడే: సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం నిర్వహించనున్న భాజపా ఎన్నికల శంఖరావ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా రానున్నారు.ఎండతీవ్రత ఉన్నా.. వర్షం కురిసినా ఇబ్బందులు ఎదురుకాకుండా ఏర్పాట్లు చేశారు. మెదక్‌ ఎంపీ భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు ఏర్పాట్లను పరిశీలించారు. నేటి మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు సభలో అమిత్‌షా పాల్గొంటారు. 15 సంవత్సరాల తర్వాత జాతీయ స్థాయి నాయకుడు సిద్దిపేటకు రావడం సంతోషంగా ఉందన్నారు.

పటిష్ఠ బందోబస్తు: సీపీ: బహిరంగ సభ నేపథ్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ అనూరాధ తెలిపారు. మెదక్‌రోడ్డులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ  కళాశాల వద్ద పీజీ కాలేజీ, నాగదేవత ఆలయం పరిసరాలు, తాడూరి బాలాగౌడ్‌ ఫంక్షన్‌హాల్‌ పక్కన వీఐపీ వాహనాల పార్కింగ్‌ ఏర్పాటు చేశామని చెప్పారు. అంబేడ్కర్‌ చౌరస్తా, నాగదేవత ఆలయం చౌరస్తా, ఎన్సాన్‌పల్లి చౌరస్తా, హైదరాబాద్‌ రోడ్డులోని బీజేఆర్‌ చౌరస్తాల వద్ద ట్రాపిక్‌ మళ్లింపు ఉంటుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని