logo

తెలంగాణ వయా కర్ణాటక

జహీరాబాద్‌.. 1956 నవంబరు 1 వరకు హైదరాబాద్‌ రాష్ట్రంలోనే కొనసాగింది. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని కొన్ని పట్టణాలు, గ్రామాలు కర్ణాటక, మహారాష్ట్ర, అక్కడి పట్టణాలు అప్పటి ఆంధ్రప్రదేశ్‌లో విలీనమై ఉండేవి.

Published : 25 Apr 2024 02:53 IST

జహీరాబాద్‌.. 1956 నవంబరు 1 వరకు హైదరాబాద్‌ రాష్ట్రంలోనే కొనసాగింది. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని కొన్ని పట్టణాలు, గ్రామాలు కర్ణాటక, మహారాష్ట్ర, అక్కడి పట్టణాలు అప్పటి ఆంధ్రప్రదేశ్‌లో విలీనమై ఉండేవి. అప్పట్లో హైదరాబాద్‌ రాష్ట్రంలో 17 జిల్లాలు ఉండేవి. ప్రస్తుత తెలంగాణలోని హైదరాబాద్‌, మెదక్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, నల్గొండ, ఆదిలాబాద్‌, వరంగల్‌, మహబూబ్‌నగర్‌, కర్ణాటకలోని బీదర్‌, గుల్బర్గా, రాయచూర్‌, మహారాష్ట్రలోని బీడ్‌, పర్బణి, నాందేడ్‌, ఔరంగాబాద్‌, ఉస్మానాబాద్‌ జిల్లాలు ఉండేవి.

కేంద్రంగా.. అప్పట్లో నిజాం పాలనలో ఈ ప్రాంతం కొనసాగింది. హైదరాబాద్‌, వికారాబాద్‌, జహీరాబాద్‌, బీదర్‌ మీదుగా పర్లి వరకు రైలు సదుపాయం కల్పించారు. హైదరాబాద్‌ నుంచి ఈ ప్రాంతం మీదుగా నల్‌దుర్గ్‌ వరకు 180 కి.మీ. మెటల్‌ దారి ఉండగా.. 1972లో రెండు వరుసలకు విస్తరించి తారురోడ్డుగా మార్చారు. ఆ తర్వాత ఇదే రహదారి 65వ నంబరు జాతీయ రహదారిగా రూపాంతరం చెందింది. ఈ ప్రాంతంలో డిపో ఏర్పాటుచేసి బస్సు సర్వీసులను వివిధ ప్రాంతాలకు నడిపించారు. కొంతకాలం జహీరాబాద్‌ బీదర్‌ జిల్లా పరిధిలోనూ కొనసాగింది. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కలువగా.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతోంది. 2008లో జహీరాబాద్‌ కేంద్రంగా లోక్‌సభ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం.

 - న్యూస్‌టుడే, జహీరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని