logo

నాసి విత్తనాల విక్రయదారులపై ఉక్కుపాదం: సీపీ

నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసు కమిషనర్‌ బి.అనూరాధ అన్నారు. విత్తన అక్రమార్కులపై పీడీ చట్టం అమలు చేస్తామని హెచ్చరించారు.

Published : 20 May 2024 01:02 IST

అనూరాధ 

సిద్దిపేట టౌన్, న్యూస్‌టుడే: నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసు కమిషనర్‌ బి.అనూరాధ అన్నారు. విత్తన అక్రమార్కులపై పీడీ చట్టం అమలు చేస్తామని హెచ్చరించారు. ఇందుకోసం ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్‌ బృందాలు ఏర్పాటు చేశామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి కాకుండా సరిహద్దు ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఈ మేరకు ఆదివారం కమిషనరేట్‌ నుంచి ప్రకటన విడుదల చేశారు. ధనార్జనే ధ్యేయంగా కొంతమంది అక్రమార్కులు ప్రముఖ బ్రాండెడ్‌ కంపెనీల పేరుతో నాసివి, కాలం చెల్లినవి రీసైక్లింగ్‌ చేసి కొత్తవని చెప్పి రైతుకు అమ్మడం ద్వారా మోసపుచ్చుతున్నారని పేర్కొన్నారు. విత్తన, ఎరువుల దుకాణాలను, గోదాములను ఆకస్మికంగా తనిఖీలు చేసి అనుమానం వస్తే నమూనాలను పరీక్షలకు పంపిస్తామన్నారు. లైసెన్సులు లేకుండా వ్యాపారం నిర్వహించే వారిపైనా చర్యలుంటాయన్నారు. నాణ్యమైనవి.. ప్రభుత్వ అనుమతి పొందిన విత్తనాలు వినియోగించేలా ప్రతి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. అక్రమ రవాణా, సరఫరాను నిరోధించేందుకు సాంకేతిక పరిజ్ఞానం ఒకవైపు.. ఇన్‌ఫార్మర్ల వ్యవస్థ మరోవైపు పటిష్ఠంగా వినియోగిస్తామని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని