logo

స్థానిక సంస్థల ఎన్నికల్లో.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఓబీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపల్లి పాండు డిమాండ్‌ చేశారు.

Updated : 20 May 2024 04:37 IST

మాట్లాడుతున్న ఓబీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాండు, పక్కన నాయకులు 

సంగారెడ్డి అర్బన్, న్యూస్‌టుడే: త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఓబీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపల్లి పాండు డిమాండ్‌ చేశారు. ఆదివారం సంగారెడ్డిలోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో 54 శాతం బీసీలు ఉన్నారని..  సీట్లు, ఓట్లు మావే అనే నినాదంతో మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీఆర్‌ 34శాతం రిజర్వేషన్లు కల్పించారన్నారు. గత ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం కేసీఆర్‌ రిజర్వేషన్లు తగ్గించి తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం 42 శాతానికి రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో బీసీ యువత విభాగం జిల్లా అధ్యక్షుడు రమేశ్, బీసీ జిల్లా నాయకులు కాల్వగడ్డ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని