logo

కందికి పెరిగిన డిమాండ్‌

తాండూరు కందికి దేశవ్యాప్తంగా పెరిగిన డిమాండ్‌ నేపథ్యంలో స్థానిక వ్యవసాయ పరిశోధన స్థానంలో విత్తనోత్పత్తిని భారీగా పెంచాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు.

Published : 26 May 2024 02:12 IST

ఈ ఏడాది 1500 క్వింటాళ్ల విత్తనోత్పత్తి లక్ష్యం

న్యూస్‌టుడే, తాండూరు, వికారాబాద్‌: తాండూరు కందికి దేశవ్యాప్తంగా పెరిగిన డిమాండ్‌ నేపథ్యంలో స్థానిక వ్యవసాయ పరిశోధన స్థానంలో విత్తనోత్పత్తిని భారీగా పెంచాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. యేటా కేవలం 300 క్వింటాళ్ల విత్తనాలను మాత్రమే రైతులకు అందుబాటులో ఉంచే వారు.

  • 2022 డిసెంబరులో తాండూరు కందులకు భౌగోళిక గుర్తింపు లభించింది. 2023 నుంచి సాగైన కందులకు విపణిలో క్వింటాలుకు రూ.12,000 నుంచి రూ.12,800 పైబడి ధరలు లభిస్తున్నాయి. రైతులు కంది సాగు వైపు ఎక్కువ దృష్టి పెట్టారు. విత్తనాలకు డిమాండ్‌ ఉంటోంది. వచ్చే ఏడాది కందిసాగుపై మరింత దృష్టి పెట్టే అవకాశం ఉందనీ, విత్తనాల కొనుగోలుకు డిమాండ్‌ పెరుగుతుందని అంచనా వేశారు.

రైతులతో శాస్త్రవేత్తల సంప్రదింపులు

ఏటా ఉత్పత్తి చేసే విత్తనాల కంటే ఐదింతల ఎక్కువతో 1500 క్వింటాళ్ల విత్తనాలను ఉత్పత్తి చేయాలని నిర్ణయించినట్లు వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ సుధాకర్‌ తెలిపారు. ఈ మేరకు విత్తన కందులను సాగు చేసే రైతులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. వ్యవసాయ పరిశోధన స్థానంలో నాలుగు కిలోల సామర్థ్యం ఉన్న విత్తన పొట్లాన్ని రూ.600 చొప్పున విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని