logo

విద్యార్థులకు ఇబ్బందులు కలగొద్దు: డీఈవో

అమ్మ ఆదర్శ పాఠశాలల్లో జరుగుతున్న పనులను జూన్‌ 5లోగా పూర్తి చేయాలని జిల్లా విద్యాధికారి రాధాకిషన్‌ తెలిపారు.

Published : 26 May 2024 02:39 IST

ఆరెగూడెంలో పనులు పరిశీలిస్తున్న రాధాకిషన్‌

వెల్దుర్తి, న్యూస్‌టుడే: అమ్మ ఆదర్శ పాఠశాలల్లో జరుగుతున్న పనులను జూన్‌ 5లోగా పూర్తి చేయాలని జిల్లా విద్యాధికారి రాధాకిషన్‌ తెలిపారు. శనివారం వెల్దుర్తి మండలంలోని ఆరెగూడెం, ఉప్పులింగాపూర్, ఉప్పులింగాపూర్‌ తండా, ఎదులపల్లి, బండపోసానిపల్లి పాఠశాలల్లో జరుగుతున్న అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పరిశీలించించారు. ఉప్పులింగాపూర్, ఎదులపల్లి పాఠశాలల్లో పనులు నత్తనడకన జరుగుతుండడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. చకచకా పనులను చేయాలని నిర్మాణ కార్మికులకు చెప్పారు. పాఠశాలలు ప్రారంభం అయ్యేలోగా పనులు పూర్తి చేస్తే విద్యార్థులకు ఇబ్బందులు తప్పుతాయని చెప్పారు. మండల విద్యాధికారి అరికెల యాదగిరి, సీఆర్‌పీ రాజు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని