logo

నకిలీవి విక్రయిస్తే కఠిన చర్యలు: డీఏవో

ఎరువుల దుకాణాల్లో నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్‌ అన్నారు.

Published : 28 May 2024 00:59 IST

అల్లాదుర్గం న్యూస్‌టుడే: ఎరువుల దుకాణాల్లో నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్‌ అన్నారు. సోమవారం అల్లాదుర్గం మండలంలోని ముస్లాపూర్‌ రైతు వేదికలో పెద్దశంకరంపేట్, రేగోడు, టేక్మాల్, అల్లాదుర్గం మండలాల్లోని ఎరువుల దుకాణాల డీలర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. దుకాణంలో నిల్వల వివరాలు, ధరల పట్టిక, ప్రభుత్వ అనుమతి ధ్రువపత్రం బోర్డులో ప్రదర్శించాలన్నారు. ఎమ్మార్పీ ధరలకే విక్రయాలు జరగాలన్నారు. చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడితే లైసెన్సులను రద్దు చేస్తామని పేర్కొన్నారు. ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసిన రైతులకు రసీదులు తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. సహాయ సంచాలకులు రాంప్రసాద్, మండల వ్యవసాయ అధికారులు రాజేష్, జావీద్‌ తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని