logo

రీజినల్‌ రింగ్‌రోడ్‌ భూనిర్వాసితులతో సమావేశం

రీజినల్‌ రింగ్‌ రోడ్‌(ఆర్‌ఆర్‌ఆర్‌) భూ సేకరణకు సోమవారం ఆర్డీవో జయచంద్ర రెడ్డి, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ఆయా గ్రామాల భూనిర్వాసితులతో తూప్రాన్‌లో సమావేశం ఏర్పాటు చేశారు.

Published : 28 May 2024 01:04 IST

తూప్రాన్‌లో రైతులతో సమావేశమైన ఆర్డీవో జయచంద్రారెడ్డి, ఎన్‌హెచ్‌ఎఐ అధికారులు

తూప్రాన్‌: రీజినల్‌ రింగ్‌ రోడ్‌(ఆర్‌ఆర్‌ఆర్‌) భూ సేకరణకు సోమవారం ఆర్డీవో జయచంద్ర రెడ్డి, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ఆయా గ్రామాల భూనిర్వాసితులతో తూప్రాన్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. తూప్రాన్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో 8 గ్రామాల మీదుగా రీజనల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణం జరగనున్న నేపథ్యంలో భూమి కోల్పోతున్న రైతులను పిలిచి మాట్లాడారు. సోమవారం నుంచి ఈ నెల 30వ తేదీ వరకు 8 గ్రామాల రైతులతో విడతల వారీగా సమావేశం నిర్వహించి వారి సందేహాలను నివృత్తి చేస్తామన్నారు. రెవెన్యూ అధికారులు, రైతులు పాల్గొన్నారు. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు