ఆంగ్లం.. కాస్త కష్టపడుదాం
ఆంగ్లం అనగానే ప్రతి విద్యార్థికి ఎంతో కొంత భయం ఉంటుంది. ప్రత్యేక ధ్యాస పెట్టి.. పదాలు అర్థం చేసుకొని, తప్పులు లేకుండా రాయగలిగితే.. మంచి మార్కులు సాధ్యం.
పక్కా ప్రణాళికతో మార్కులు సాధ్యం
న్యూస్‌టుడే, మెదక్
ఆంగ్లం అనగానే ప్రతి విద్యార్థికి ఎంతో కొంత భయం ఉంటుంది. ప్రత్యేక ధ్యాస పెట్టి.. పదాలు అర్థం చేసుకొని, తప్పులు లేకుండా రాయగలిగితే.. మంచి మార్కులు సాధ్యం. పదాల అర్థాలు తెలియాలంటే నిఘంటువును ఆశ్రయించాల్సిందే. వ్యాసాలలో పదాల కూర్పు తప్పనిసరి. ఈ సారి పది ఆంగ్లం ప్రశ్నాపత్రంలో పలు మార్పులు చేశారు. గతంలో పేపర్-1, 2గా ఉండేది. ఈ సారి ఒకే పేపర్‌గా మారింది. పార్ట్-ఏలో 60 మార్కులు, బిలో 20 మార్కులు ఉంటాయి. సులువుగా మార్కుల సాధనకు అనుసరించాల్సిన విధానాలు, ఇతర అంశాలు మెదక్ మండలం మక్తభూపతిపూర్ జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఆంగ్ల ఉపాధ్యాయుడు నూల పూర్ణచందర్‌రావు ‘ఈనాడు’తో పంచుకున్నారు.
అర్థం చేసుకుంటూ..
పార్ట్-ఏలో comprehension లోని రెండు ప్యాసేజీలు పుస్తకంలోని రీడింగ్ ఏ, బీ, సీల నుంచే వస్తాయి. వాటిని తప్పనిసరిగా చదవాలి. తద్వారా వోకాబ్యులరీ, ఎడిటింగ్‌లో అత్యధిక మార్కులు తెచ్చుకోవచ్చు. పుస్తకం చదవడం వల్ల పార్ట్-ఏలో 24 మార్కులు సాధించవచ్చు. గమనించాల్సిన విషయం ఏంటంటే పుస్తకంలోని రీడీంగ్ ఏ, బీ, సీలను చదివే సమయంలో అర్థం చేసుకోవాలి. ముఖ్య పదాల అర్థాలు, ఆయా పదాల పర్యాయాలు (synonyms), వ్యతిరేక పదాల (antonyms) ను దృష్టిలో ఉంచుకొని చదవాలి. ఇందుకు మంచి ఆంగ్లం-తెలుగు నిఘంటువు, synonyms, antonyms (Thesaurus) ను తప్పనిసరిగా వాడే అలవాటు చేసుకోవాలి. ఇది 5 మార్కులు కచ్చితంగా సాధించవచ్చు. పార్ట్-ఏలో ఇచ్చే comprehension, unseen passages ఇచ్చే ప్రశ్నలకు సమాధానాలు రాయడానికి దోహదపడుతుంది.
* అంతే కాకుండా ఈ సారి కొత్తగా స్టడీ స్కిల్, గ్రాఫికల్ ఇన్‌ఫర్మేషన్ ఇచ్చి వాటిపై ప్రశ్నలు ఇస్తారు. వాటిని అర్థం చేసుకొని సమాధానాలు రాయాలి. దీనికి 5 మార్కులు.
* ట్రాన్స్‌ఫర్‌మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ ఆక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, రిపోర్టెడ్ స్పీచ్, సింథెసిస్, కండిషనల్స్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, వర్బ్ ఫార్మ్స్, ట్యాగ్ ప్రశ్నలు అడుగుతారు. వీటిపై పట్టు సాధించాలంటే గ్రామర్ పుస్తకంలోని అభ్యాసాలతో పాటు ఉపాధ్యాయుడు ఇచ్చినవీ సాధన చేయాలి.
తప్పులు లేకుండా..
ఇక డిస్కర్సెస్ విషయానికి వస్తే 20 మార్కులు కేటాయించారు. ఒక్క దానికి 10 మార్కులు. ఇందులో ఆప్షన్ ఉంటుంది. రెండు మైనర్ డిస్కర్సెస్ 5+5 మార్కులు కేటాయించారు. ఇందులో ఆప్షన్ ఉండదు. ఈ మూడు ప్రశ్నలు పుస్తకంలో ఇవ్వబడిన ఎనిమిది థీమ్స్ ఆధారంగా ఇస్తారు. అనగా పుస్తకాన్ని బాగా చదివి అందులో ఇవ్వబడిన డిస్కర్స్‌ను సాధన చేయాలి. విద్యార్థులు సొంతంగా సాధారణ ఆంగ్ల భాషలో తప్పులు లేకుండా రాయడం క్రమంగా అలవాటు చేసుకోవాలి. చక్కని చేతి రాతలో తప్పులు లేకుండా ఉండటం ఎంతో ముఖ్యం.
పార్ట్-బీలో..
ఇందులో మొదట అన్‌సీన్ ప్యాసేజ్ లేదా అన్‌సీన్ పద్యం వస్తుంది. దీన్ని అర్థం చేసుకుంటే సమాధానాలు రాయడం సులభం. ఒక వేళ అన్‌సీన్ పద్యం వస్తే సాధారణ ప్రశ్నలతో పాటు ఒకటి లేదా రెండు ఆంగ్లం అలంకారాలపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. దీనిపై అవగాహన ఉండటం తప్పనిసరి. తర్వాత ఎడిటింగ్‌లో నుంచి ప్రశ్నలుంటాయి. ఇందులో ఐదు పదాలు తప్పులు ఇచ్చి వాటిని సరిచేయమని అడుగుతారు. అందుకు రీడింగ్, ఏ, బీ, సీ పూర్తిగా అవగాహనతో చదవాలి. ఆబ్జెక్టివ్ టైపులో 5 ఖాళీలు ఇచ్చి వాటిని పూరించమంటారు. ఇది అన్‌సీన్ ప్యాసేజ్. జాగ్రత్తగా చదివి అర్థం చేసుకొని సమాధానాలు రాయాలి.
* చివరిగా వోకాబ్యులరీపై పుస్తకంలో నుంచి ఐదు ప్రశ్నలు వస్తాయి. దీనిలో అర్థాలు, సిననిమ్స్, ఆంటనిమ్స్, హోమోఫోన్స్, తప్పుల పదాలు వంటివి ఇచ్చి సరిచేయమని అడుగుతారు. అందుకు పుస్తకాన్ని పూర్తి విశ్లేషణతో చదవాలి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Smriti Irani: జర్నలిస్టును ‘బెదిరించిన’ స్మృతి ఇరానీ.. వీడియో షేర్ చేసిన కాంగ్రెస్
-
Sports News
WTC Final: వారి ఆటతీరు.. టాప్‌ఆర్డర్‌కు గుణపాఠం: సౌరభ్ గంగూలీ
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Harishrao: ఏపీ నేతలకు మాటలెక్కువ.. చేతలు తక్కువ: హరీశ్‌రావు
-
India News
MHA: మణిపుర్ హింసాత్మక ఘటనలు..! శాంతి స్థాపనకు కమిటీ ఏర్పాటు
-
General News
Parthasarathy: ఎమ్మెల్యే పార్థసారథికి గుండెపోటు