logo

పాన్‌షాప్‌లో చోరీ.. పాత నేరస్థుడి రిమాండ్‌

పాన్‌ డబ్బాలో చోరీకి పాల్పడిన పాతనేరస్థుడిని రిమాండ్‌కు తరలించిన ఘటన పటాన్‌చెరు ఠాణా పరిధిలో జరిగింది.

Published : 24 Mar 2023 01:11 IST

పటాన్‌చెరు అర్బన్‌: పాన్‌ డబ్బాలో చోరీకి పాల్పడిన పాతనేరస్థుడిని రిమాండ్‌కు తరలించిన ఘటన పటాన్‌చెరు ఠాణా పరిధిలో జరిగింది. నేరవిభాగం ఎస్సై పవన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌కి చెందిన వడ్డేకుమార్‌ ఆలియాస్‌ సంపంగి శివకుమార్‌ ఈనెల 21న పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌లో రేణుకావైన్స్‌ దుకాణం పక్కన పాన్‌దుకాణంలో చోరీకి పాల్పడ్డాడు. దాదాపు రూ.10వేలకు పైగా సామగ్రి దోచుకుని వెళ్లిపోయాడు. పటాన్‌చెరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తుండగా ముత్తంగి బావార్చి హోటల్‌ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న  శివకుమార్‌ అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఇస్నాపూర్‌ పాన్‌ దుకాణంలో చోరీచేసింది తనే అని ఒప్పుకొన్నాడు. గతంలో మెదక్‌, జోగిపేట, సంగారెడ్డి, పటాన్‌చెరు, చందానగర్‌ ప్రాంతాల్లో 27 దొంగతనాలను చేసి ఆరుసార్లు జైలుకు వెళ్లివచ్చినట్లుగా అంగీకరించాడు. ఈ క్రమంలో పాన్‌దుకాణంలో దోచుకున్న సామగ్రిని స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని