logo

రైతుబంధు సమన్వయ సమితి పదవులకు రాజీనామా

రైతుబంధు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్‌, మండల కోఆర్డినేటర్లు పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో జిల్లా కోఆర్డినేటర్‌ వంగ నాగిరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం డీఏవో శివప్రసాద్‌ను కలిసి రాజీనామా పత్రాన్ని అందజేశారు.

Published : 07 Dec 2023 00:44 IST

డీఏవో శివప్రసాద్‌కు రాజీనామా పత్రం అందజేస్తున్న జిల్లా, మండల కోఆర్డినేటర్లు

తిసిద్దిపేట అర్బన్‌, న్యూస్‌టుడే: రైతుబంధు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్‌, మండల కోఆర్డినేటర్లు పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో జిల్లా కోఆర్డినేటర్‌ వంగ నాగిరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం డీఏవో శివప్రసాద్‌ను కలిసి రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో అయిదేళ్లుగా రైతులకు అన్ని సేవ చేశామన్నారు. నూతన ప్రభుత్వం రైతు సంక్షేమ పథకాలను కొనసాగించాలన్నారు. ప్రతిపక్ష పాత్ర వహిస్తూ పల్లెల్లో కర్షకులకు సహాయసహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. ఆయన వెంట పాపయ్య, దుర్గయ్య, సంపత్‌, మోహన్‌రెడ్డి, బాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని